India’s T20 World Cup Squad: క్లోజ్ ఫ్రెండ్‌పై నమ్మకం ఉంచని విరాట్ కోహ్లీ.. టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం ఎందుకు ఇవ్వలేదంటే..?

విరాట్ కోహ్లీ సారథ్యంలో ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యుల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టులో చాలా మంది పెద్ద ఆటగాళ్ల పేర్లు లేకపోవడం గమనార్హం.

India’s T20 World Cup Squad: క్లోజ్ ఫ్రెండ్‌పై నమ్మకం ఉంచని విరాట్ కోహ్లీ.. టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం ఎందుకు ఇవ్వలేదంటే..?
Follow us
Venkata Chari

|

Updated on: Sep 09, 2021 | 9:52 AM

T20 World Cup: టీ 20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం ఈజట్టుపై తీవ్రమైన చర్చలు మొదలయ్యాయి. చాలా మంది కొత్త, యువ ఆటగాళ్లకు జట్టులో అవకాశం ఇవ్వగా, విరాట్ కోహ్లీకి అత్యంత సన్నిహితుడైన స్టార్ స్పిన్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్‌కు మాత్రం అవకాశం దక్కలేదు. బీసీసీఐ నిర్ణయంతో అభిమానులు, అనుభవజ్ఞులు ఆశ్చర్యపోయారు. యూఏఈలో జరగనున్న టీ 20 ప్రపంచకప్‌లో భారత జట్టు అక్టోబర్ 24 న పాకిస్థాన్‌తో తన పోరాటాన్ని ప్రారంభిస్తుంది.

టీ 20 ఫార్మాట్‌లో యుజ్వేంద్ర చాహల్ భారతదేశం తరపున అత్యంత విజయవంతమైన బౌలర్. చాహల్ తన స్పిన్‌తో బ్యాట్స్‌మెన్‌లను ట్రాప్ చేయడంలో నేర్పరి. కానీ, రాబోయే పొట్టి ప్రపంచ కప్‌ కోసం మాత్రం అతడిని సెలెక్టర్ల ఎంపిక చేయలేదు. ఆర్‌సీబీలో విరాట్ కోహ్లీకి అత్యంత విశ్వసనీయ ఈ బౌలర్.. 15 మంది సభ్యుల భారత జట్టులో చోటుదక్కకపోవడం గమనార్హం. చాహల్ స్థానంలో అనుభవజ్ఞుడైన ఆర్ అశ్విన్‌ను జట్టులో చేర్చారు.

టీ 20 లో అత్యంత విజయవంతమైన బౌలర్.. యుజ్వేంద్ర చాహల్ ఇప్పటివరకు 49 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 63 వికెట్లు తీశాడు. ఒక ఇన్నింగ్స్‌లో రెండుసార్లు అత్యధిక వికెట్లు పడగొట్టాడు. ఒకసారి 5 వికెట్లు, మరోసారి 4 వికెట్లు తీశాడు. 8 ఎకానమీతో వికెట్లను పడగొట్టాడు. 31 ఏళ్ల చాహల్ ప్రదర్శన కొంతకాలంగా ఆకట్టుకునేలా లేదు. అందుకే అతనికి అవకాశం దక్కలేదు. అక్టోబర్ 2019 వరకు, చాహల్ 31 మ్యాచ్‌ల్లో 46 వికెట్లు సాధించాడు. ఈ సమయంలో అతని సగటు 21గా ఉంది. నవంబర్ 2019 తర్వాత చాహల్ 18 టీ 20 మ్యాచ్‌లలో 17 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఈ సమయంలో సగటు 37 కూడా ఉంది. యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరుపున ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 106 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 7.70 ఎకానమీ రేటుతో 125 వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో అతని సగటు 23.30గా నమోదైంది.

చాహల్ స్థానంలో ఆర్ అశ్విన్.. చాహల్ స్థానంలో స్పెషలిస్ట్ స్పిన్ బౌలర్‌గా ఆర్ అశ్విన్ జట్టులో చేరాడు. దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత, అశ్విన్ పరిమిత ఓవర్ల క్రికెట్‌‌లోకి తిరిగి వచ్చాడు. అతను 2017 లో వెస్టిండీస్‌తో తన చివరి పరిమిత ఓవర్ మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి టెస్ట్ ఫార్మాట్‌లో మాత్రమే కనిపించాడు. అశ్విన్‌తో పాటు అక్షర్ పటేల్, రాహుల్ చాహర్ కూడా అవకాశం దక్కించుకున్నారు.

టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్(కీపర్), రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమీ, అక్సర్ పటేల్, ఆర్ అశ్విన్

రిజర్వ్ ప్లేయర్: శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్

Also Read:

‘శిఖర్‌ ధావన్‌ మాకెంతో కీలకమైన ప్లేయర్.. కానీ, ఎందుకు సెలక్ట్ చేయలేదంటే..?’: అసలు విషయం చెప్పిన చేతన్ శర్మ

India’s T20 World Cup Squad: ఈ 15 మంది ఆటగాళ్ల ప్రత్యేకతలేంటో తెలుసా..?

T20 World Cup: పొట్టి ఫార్మాట్‌కు దూరమైన ఆటగాళ్లు.. ఇంటికే పరిమితం చేసిన బీసీసీఐ.. ఎందుకో తెలుసా?