T20 World Cup: పొట్టి ఫార్మాట్‌కు దూరమైన ఆటగాళ్లు.. ఇంటికే పరిమితం చేసిన బీసీసీఐ.. ఎందుకో తెలుసా?

India's T20 World Cup Squad: విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు మొదటిసారిగా టీ 20 ప్రపంచకప్‌లో పాల్గొంటుంది. రోహిత్ శర్మను భారత వైస్ కెప్టెన్‌గా నియమించారు.

T20 World Cup: పొట్టి ఫార్మాట్‌కు దూరమైన ఆటగాళ్లు.. ఇంటికే పరిమితం చేసిన బీసీసీఐ.. ఎందుకో తెలుసా?
Teamindia
Follow us
Venkata Chari

|

Updated on: Sep 09, 2021 | 7:31 AM

India’s T20 World Cup Squad: టీ 20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ భారత జ,ట్టును ప్రకటించింది. యూఏఈలో జరిగే ఈ టోర్నమెంట్ కోసం, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 18 మంది సభ్యులు ఎంపికయ్యారు. కానీ, చాలా మంది సీనియర్ ప్లేయర్లతోపాటు, ఫాంలో ఉన్న యువ ఆటగాళ్లకు చోటు దక్కలేదు. వీరిలో కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, టి నటరాజన్, శిఖర్ ధావన్, సంజు శాంసన్, మనీష్ పాండే వంటి పేర్లు ఉన్నాయి. కుల్‌దీప్, శామ్సన్, పాండే ఇటీవల శ్రీలంక పర్యటనలో జరిగిన టీ 20 సిరీస్‌లో టీమిండియాలో ఉన్నారు. వీరు కాకుండా, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, శ్రేయస్ అయ్యర్ వంటి కీలక ఆటగాళ్లను కూడా ప్రధాన జట్టులో చేర్చలేదు. వీరిని స్టాండ్‌బైగా ఉంచారు.

జులైలో శ్రీలంకలో పర్యటించిన భారత జట్టులో ధావన్, చాహల్, సామ్సన్, పాండే, కుల్దీప్ ఉన్నారు. అక్కడ టీ 20 సిరీస్‌లు కూడా ఆడారు. కానీ, ప్రపంచ కప్ కోసం సెలెక్టర్ల నమ్మకాన్ని పొందలేకపోయారు. అయితే, ధావన్ లేకపోవడం చాలా ఆశ్చర్యకరంగా మారింది. గత రెండు ఐపీఎల్‌లలో అత్యధిక పరుగులు చేసిన వారిలో ధావన్‌ ఒకడు. అయితే, టీ 20 వరల్డ్ కప్ కోసం అతనికి బదులుగా ఇషాన్ కిషన్‌‌ను ఓపెనర్‌గా తీసుకున్నారు. సెలక్టర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, కిషన్‌లను ఓపెనర్లుగా ఎంపిక చేశారు.

ఈ ఆటగాళ్లను ఎందుకు ఎంచుకోలేదు.. కుల్దీప్ యాదవ్- ఇటీవలి కాలంలో ఫామ్‌లో లేడు. 2019 నుంచి కుల్దీప్ అంతగా రాణించడం లేదు. ఐపీఎల్‌లో కూడా కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోలేక పోయాడు. దీంతో బీసీసీఐ కుల్దీప్‌పై విశ్వాసం చూపలేకపోయింది.

యుజ్వేంద్ర చాహల్ – యుజ్వేంద్ర ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, ఆపై స్వదేశంలో జరిగిన సిరీస్‌లో ఆడలేదు. ఇతని స్థానంలో కొత్త లెగ్ స్పిన్నర్లు రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తి మెరుగ్గా ఆడుతున్నారు.

సంజు శాంసన్- టీమిండియాలో తనకు వచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. మరోవైపు రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణిస్తుండడంతో శాంసన్‌కు చోటు కష్టమైంది.

మనీష్ పాండే- ఈ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఇప్పటివరకు టీమిండియాలో పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయాడు. దేశీయంగా రాణించినా.. టీమిండియా తరపును అంతగా ఆకట్టుకోలేకపోయాడు.

టీ 20 ప్రపంచకప్ కోసం భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అశ్విన్, రాహుల్ చాహర్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి.

సపోర్టింగ్ ప్లేయర్స్ – శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్.

Also Read: T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌కు టీమిండియా ఇదే.. జట్టుకు మెంటార్‌గా ధోని..

India vs England: ఓటమి తర్వాత ఇంగ్లాండ్ జట్టులో మార్పులు.. ఇద్దరు మెరుగైన ఆటగాళ్లు జట్టులోకి.. ఎవరంటే..?

Afghanistan Crisis: ఆటలాడితే అంతే సంగతులు.. మహిళల క్రీడలపై నిషేధం విధించిన తాలిబన్లు..