- Telugu News Photo Gallery Cricket photos India’s T20 World Cup Squad: know about the indian squad 15 players going to hunt for the t20 world cup title
India’s T20 World Cup Squad: ఈ 15 మంది ఆటగాళ్ల ప్రత్యేకతలేంటో తెలుసా..?
వచ్చే నెలలో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం బిసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈసారి ప్రపంచ కప్ యూఏఈలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
Updated on: Sep 09, 2021 | 7:39 AM

వచ్చే నెల అక్టోబర్ నెలలో జరగనున్న ఐసీసీ టీ 20 ప్రపంచకప్ కోసం బిసీసీఐ జట్టును ప్రకటించింది. టీ 20 ప్రపంచ కప్‌ను భారతదేశంలో నిర్వహించాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా యూఏఈలో నిర్వహించాలని బిసీసీఐ నిర్ణయించింది.

Virat kohi

టీ 20 ఫార్మాట్‌లో రోహిత్ శర్మ విధ్వసం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. 111 టీ 20 ల్లో 2864 పరుగులు చేశాడు. 32.54 సగటు, 138.96 స్ట్రైక్ రేట్‌తో 22 అర్ధ సెంచరీలతోపాటు నాలుగు సెంచరీలు కూడా చేశాడు. ఐపీఎల్‌లో 108 మ్యాచ్‌లలో 135.28 స్ట్రైక్ రేట్‌తో 2197 పరుగులు సాధించాడు.

వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ కూడా టీ20కి సరిగ్గా పరిపోతాడు. ఇప్పటి వరకు 33 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 123.07 స్ట్రైక్ రేట్‌లో 512 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ కూడా ఉంది. ఈ 33 మ్యాచ్‌లలో 21.33 సగటుతో పరుగులు రాబట్టాడు.

సూర్య కుమార్ యాదవ్ కొంతకాలం క్రితం టీ 20 ఫార్మాట్‌లో అరంగేట్రం చేశాడు. అతను అంతర్జాతీయ స్థాయిలో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 169.51 స్ట్రైక్ రేట్‌తో 139 పరుగులు చేశాడు. ఐపీఎల్, దేశీయ క్రికెట్‌లో అతని రికార్డు అద్భుతంగా ఉంది. దేశీయ స్థాయిలో 181 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 141.15 స్ట్రైక్ రేట్‌తో 3879 పరుగులు సాధించాడు.

ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పటి వరకు 50 టీ 20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను 15.50 సగటుతో 217 పరుగులు చేశాడు. మరోవైపు, బౌలింగ్ విషయానికి వస్తే జడేజా పొట్టి ఫార్మెట్‌లో 39 వికెట్లు తీసుకున్నాడు. 4.92 ఎకానమీ రేటుతో వికెట్లు సాధించాడు.

భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన కెరీర్‌లో 49 మ్యాచ్‌లు ఆడాడు. 19.36 సగటుతో 484 పరుగులు సాధించాడు. 145.34 స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబట్టాడు. అలాగే 8.17 ఎకానమీ రేటుతో 42 వికెట్లు పడగొట్టాడు.

టీ 20 ప్రపంచకప్‌లో టీమిండియాకు భారత నంబర్ వన్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చాలా కీలకం కానున్నాడు. తన కెరీర్‌లో ఇప్పటి వరకు 50 అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 6.66 ఎకానమీ రేటుతో 59 వికెట్లు తీసుకున్నాడు.

భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 51 అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌లు ఆడాడు. అతను ఈ 51 మ్యాచ్‌లలో 6.90 ఎకానమీ రేటుతో 50 వికెట్లు తీశాడు. భువీ సగటు 32.18గా ఉంది.

స్పిన్ బౌలర్ రాహుల్ చాహర్ అంతర్జాతీయ స్థాయిలో కేవలం ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇందులో, అతను 7.60 ఎకానమీ రేటుతో ఏడు వికెట్లు పడగొట్టాడు. దేశీయ స్థాయిలో 66 టీ 20 మ్యాచ్‌ల్లో 7.32 ఎకానమీ రేటుతో 82 వికెట్లు సాధించాడు. అలాగే ఐపీఎల్‌లో 38 మ్యాచ్‌లు ఆడి, 7.41 ఎకానమీ రేటుతో 41 వికెట్లు పడగొట్టాడు.

అక్షర్ పటేల్ కూడా టీ20 జట్టులో అవకాశం కల్పించారు. అతను 12 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 6.88 ఎకానమీ రేటుతో 9 వికెట్లు పడగొట్టాడు. 156 దేశీయ టీ 20 మ్యాచ్‌ల్లో 6.85 ఎకానమీ రేటుతో 133 వికెట్లు పడగొట్టాడు. అక్షర్‌ను ఆల్ రౌండర్‌గా జట్టులో చేర్చారు.

ఆర్ అశ్విన్ అనుభవం జట్టుకు ఎంతో మేలు చేస్తుందనడంలో సందేహం లేదు. అశ్విన్ అంతర్జాతీయ స్థాయిలో 46 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 6.97 ఎకానమీ రేటుతో 52 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో, అతను బ్యాట్‌తో పాటు బౌలింగ్‌తో చాలాసార్లు అద్భుతాలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ ఏడాది టీ 20 లో అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్‌పై కూడా బీసీసీఐ విశ్వాసం ఉంచింది. ఇషాన్ అంతర్జాతీయ స్థాయిలో 3 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 37.53 సగటుతో 80 పరుగులు చేశాడు. దేశీయ స్థాయిలో 103 మ్యాచ్‌లలో 2525 పరుగులు చేసిన ఇషాన్.. ఐపీఎల్ మ్యాచ్‌లలో 1284 పరుగులు సాధించాడు. ఇషాన్ స్ట్రైక్ రేట్ 130 కంటే ఎక్కువగా ఉండడం విశేషం.

భారత అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీకి పొట్టి క్రికెట్‌లో అంతర్జాతీయ అనుభవం చాలా తక్కువగా ఉంది. కానీ, జట్టు ఇప్పటికీ అతనిపై విశ్వాసం ఉంచింది. షమీ 12 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు మాత్రమే తీశాడు. ఐపీఎల్‌లో అతను 73 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 8.81 ఎకానమీ రేటుతో 68 వికెట్లు తీసుకున్నాడు.

మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, 2019 సంవత్సరంలో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు ఆడాడు. అతను 7.34 ఎకానమీ రేటుతో 25 వికెట్లు పడగొట్టాడు. అతను టీమిండియా తరఫున మూడు మ్యాచ్‌లలో రెండు వికెట్లు మాత్రమే తీశాడు.





























