IND vs SL: శ్రీలంక పర్యటనను ముగించుకున్న టీమిండియాను కరోనా వదిలిపెట్టడంలేదు. ఇప్పటికే రెండో టీ20కు ముందు కృనాల్ పాండ్యా కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. తాజగా మరో ఇద్దరికి పాజిటివ్‌గా తేలడంతో ఆటగాళ్లు ఆందోళనలో ఉన్నారు. జులై 27న క్రునాల్ పాండ్యా కోవిడ పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. టీమిండియా సీనియర్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, స్పిన్ బౌలర్ కం ఆల్ రౌండర్ కే గౌతం కోవిడ్ పాజిటివ్‌గా తేలారు. ఇప్పటికే ఐసోలేషన్‌లో ఉన్న కృనాల్ పాండ్యాతో సన్నిహితంగా ఉన్న కారణంగా వీరిద్దరికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. కాగా, కృనాల్ పాండ్యాతో కాంటాక్ట్‌లో ఉన్న ఎనిమిది మంది ఆటగాళ్లలో వీరిద్దరు కూడా ఉండడం గమనార్హం. దాంతో కృనాల్ పాండ్యాతోపాటు చాహల్, కే గౌతం సహా మిగిలిన ఆరుగురు క్రికెటర్లు శ్రీలంకలోనే ఉన్నారు. మిగిలిన క్రికెటర్లు ఇండియా బయలుదేరి వస్తున్నట్లు సమాచారం.
కృనాల్‌తో పాటు చాహల్, గౌతమ్‌లు ప్రస్తుతానికి కొలంబోలో ఉండాలని బీసీసీఐ పేర్కొంది. వీరితో పాటు మిగతా ఆరుగురు ఆటగాళ్లు కృనాల్ సోదరుడు హార్దిక్, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, దీపక్ చాహర్, ఇషాన్ కిషన్ కూడా శ్రీలంకలోనే ఉండనున్నారు. చాహల్, గౌతం శుక్రవారం కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా తేలారు. జులై 27 న రాపిడ్ యాంటిజెన్, RT-PCR పరీక్షలలో పాజిటివ్‌గా తేలడంతో.. కృనాల్‌ను ఐసోలేషన్ ఫెసిలిటీకి తరలించారు. మిగిలిన ఎనిమిది మంది ఆటగాళ్లు హోటల్‌లోనే ఉండిపోయారు. శ్రీలంక ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, ఎవరైనా పాజిటివ్‌గా తేలితే కనీసం పది రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి. అనంతరం మరోరెండు సార్లు వారిని పరీక్షించునున్నారు. ఇందులో నెగిటివ్ వస్తే.. వారిని భారత్‌కు పంపించనున్నారు. శ్రీలంక పర్యటన ముగిసిన వెంటనే ఇంగ్లండ్‌కు వెళ్లాలనుకున్న షా, యాదవ్ జంటకు ఈ పరిణామం మరింత అడ్డంకులను కలిగిస్తుంది.
Also Read: భారత ఆల్‌రౌండర్‌తో గొడవ పడ్డాడు.. కుంబ్లే రికార్డుపై కన్నేశాడు.. ఆ దిగ్గజ బౌలర్ ఎవరంటే?