AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hardik Pandya: టీమిండియా ఆల్ రౌండర్ వాచ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. ధరెంతో తెలుసా?

ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్య ఇటీవల ఖరీదైన తన వాచ్ ఫోటోను పోస్ట్ చేశాడు. ఫోటోలో అతను రోల్స్ రాయిస్ కల్లినాన్‌లో టోపీతోపాటు సన్ గ్లాసెస్ ధరించి కనిపించాడు.

Hardik Pandya: టీమిండియా ఆల్ రౌండర్ వాచ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. ధరెంతో తెలుసా?
Hardik Pandya Watch
Venkata Chari
|

Updated on: Aug 26, 2021 | 11:49 AM

Share

Hardik Pandya: టీమిండియా ఆల్ రౌండర్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్య విలాసవంతంగా జీవించేందుకు ఇష్టపడతాడు. తన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. అలాగే తన వేషధారణతోనూ నెట్టింట్లో సందడి చేస్తుంటాడు. ఈ 27 ఏళ్ల క్రికెటర్ ఖరీదైన బ్రాండ్‌లకు మారుపేరుగా నిలుస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో ఖరీదైన వస్తువులను తన సొంతం చేసుకున్న ఈ ఆల్ రౌండర్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మరో ఖరీదైన వస్తువుతో సందడి చేస్తున్నాడు.

పాండ్యా ప్రస్తుతం అబుదాబిలో ఉన్నాడు. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండవ ఎడిషన్ కోసం ఎదురుచూస్తున్నాడు. అక్కడ ప్రాక్టీస్‌లో లీనమయ్యాడు. అయితే ఖాళీ టైంలో దుబాయ్‌లోని పలు ప్రాంతాలను చుట్టివస్తున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో విడుదల చేసిన కొన్ని ఫొటోలు వైరల్‌గా మారాయి. రోల్స్ రాయిస్ కుల్లినన్‌లో దుబాయ్ రోడ్లపై తిరుగుతూ కనిపించాడు. టోపీతో పాటు సన్ గ్లాసెస్ ధరించిన ఫొటోలు ఇందులో ఉన్నాయి.

అయితే పాండ్య చేతికున్న వాచ్ మాత్రం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఇన్‌స్టా‌లో పంచుకున్న ఫొటోలలో చివరి ఫొటోపైనే అందికి కళ్లు ఉన్నాయి. పాండ్యా అతడి మణికట్టుపై అతి అరుదైన పటెక్ ఫిలిప్ నాటిలస్ ప్లాటినమ్ 5711 వాచ్‌ను చూడొచ్చు. ఈ వాచ్ అత్యంత ఆకర్షణీయనంగా ఉంది. ఈ వాచ్ పూర్తిగా ప్లాటినంతో తయారుచేశారు. దీని ధర సుమారు రూ. 5 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే, 5711 శ్రేణి చాలా అరుదుగా లభిస్తుందంట. వీటిలో ముదురు-బూడిద రంగులో ఉన్న ఆకుపచ్చ రంగు మోడల్ చాలా అరుదని సమాచారం. గతంలో, పాండ్య తన అన్న కృనాల్‌తో కలిసి ముంబైలో 8 బీహెచ్‌కే ఫ్లాట్‌ని కొనుగోలు చేశారు. దీని ఫ్లోర్ ఏరియా సుమారు 3838 చదరపు అడుగులు. ఈ ఫ్లాట్ ధర సుమారు రూ. 30 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.

మరోవైపు ఐపీఎల్ 2021 పూర్తయిన వెంటనే ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ 2021 కూడా జరగనుంది. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో ఐపీఎల్ 2021 మరలా ప్రారంభం కానుంది. ముంబై ఇండియన్స్ టీం ఆగస్టు 13 న అబుదాబి చేరుకుంది. అబుదాబిలోని విలాసవంతమైన సెయింట్ రెగిస్ సాదియత్ రిసార్ట్‌లో ఇప్పటికే తమ క్వారంటైన్‌ను పూర్తి చేశారు. తొలి మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ టీం తలపడనుంది.

Also Read:

7వ స్థానంలో బరిలోకి.. 35 నిమిషాల్లోనే సెంచరీ.. బ్యాటింగ్‌లో దుమ్ము రేపిన ఆటగాడు.. ఎక్కడో తెలుసా?

PAK vs WI: పాకిస్తాన్‌కు షాక్.. వెస్టిండీస్ పర్యటనలో కరోనా బారిన సీనియర్ ఆటగాడు..!