T20 World Cup 2024: అన్ని జట్లకు లాస్ట్ డేట్ ఇదే.. టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్‌లపై ఐసీసీ కీలక ప్రకటన..

|

Jan 08, 2024 | 7:10 PM

T20 World Cup 2024 Squads: జూన్ 5 నుంచి T-20 ప్రపంచ కప్ 2024లో భారత జట్టు తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. మెన్ ఇన్ బ్లూ తమ మొదటి మ్యాచ్‌ని ఐర్లాండ్‌తో ఆడుతుంది. అలాగే, 9న పాకిస్థాన్‌, జూన్ 12న యూఎస్‌ఏ, జూన్ 15న కెనడాతో తలపడుతుంది. పాకిస్థాన్ జూన్ 6న యూఎస్‌ఏతో, జూన్ 11న కెనడాతో, జూన్ 16న ఐర్లాండ్‌తో పాటూ ఇతర మూడు గ్రూప్ మ్యాచ్‌లు ఆడుతాయి.

T20 World Cup 2024: అన్ని జట్లకు లాస్ట్ డేట్ ఇదే.. టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్‌లపై ఐసీసీ కీలక ప్రకటన..
Icc T20 World Cup 2024
Follow us on

టీ-20 ప్రపంచకప్ 2024కి సంబంధించి ఓ కీలక వార్త బయటకు వస్తోంది. 4 గ్రూపులుగా విభజించిన ప్రపంచ కప్‌లో ఈసారి మొత్తం 20 జట్లు పాల్గొంటాయనే సంగతి తెలిసిందే. ఒక్కో గ్రూపు నుంచి పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8 రౌండ్‌కు చేరుకుంటాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది.

ఈ టోర్నమెంట్ జూన్ 1 నుంచి ప్రారంభమవుతుందని, జూన్ 28న ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని ఐసీసీ ప్రకటించింది. ప్రపంచకప్‌కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఇప్పుడు వస్తున్న రిపోర్టుల ప్రకారం అన్ని దేశాలు తమ జట్లను ఎప్పుడు ప్రకటించాలనే తేదీని ఐసీసీ విడుదల చేసిందంట. మే 1 నాటికి అన్ని దేశాల క్రికెట్ బోర్డులు తమ టీమ్‌లను ఐసీసీకి అందించాల్సి ఉంటుందంట.

మే 1న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు ఇచ్చిన జట్టులో మే 25 నాటికి ఆయా బోర్డులు కొన్ని మార్పులు చేసుకోవచ్చంట. అయితే, ఆ తర్వాత జట్టులో మార్పు జరిగితే ఐసీసీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.

ఈ క్రమంలో ఐపీఎల్‌లో ఆటగాళ్ల ప్రదర్శనను చూడటానికి బీసీసీఐకి పూర్తి సమయం ఉంటుందన్నమాట. తద్వారా ఆటగాళ్ల ఫామ్ ఆధారంగా టీమిండియాను ఎంపిక చేసుకోవడం సులభం అవుతుంది.

2024 టీ20 ప్రపంచ కప్ గ్రూపులు..

గ్రూప్ A : ఇండియా, పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏ

గ్రూప్ B : ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్

గ్రూప్ సి : న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, పాపువా న్యూ గినియా

గ్రూప్ D : దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్

జూన్ 5న తొలి మ్యాచ్ ఆడనున్న భారత్..

జూన్ 5 నుంచి T-20 ప్రపంచ కప్ 2024లో భారత జట్టు తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. మెన్ ఇన్ బ్లూ తమ మొదటి మ్యాచ్‌ని ఐర్లాండ్‌తో ఆడుతుంది. అలాగే, 9న పాకిస్థాన్‌, జూన్ 12న యూఎస్‌ఏ, జూన్ 15న కెనడాతో తలపడుతుంది. పాకిస్థాన్ జూన్ 6న యూఎస్‌ఏతో, జూన్ 11న కెనడాతో, జూన్ 16న ఐర్లాండ్‌తో పాటూ ఇతర మూడు గ్రూప్ మ్యాచ్‌లు ఆడుతాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..