Washington Sundar Dating : వాషియో వాషి.. అందాల రాశిని పట్టేశావుగా బ్రో.. కాఫీ తాగుతూ కంటపడిన జంట
టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, నటి, స్పోర్ట్స్ ప్రజెంటర్ అయిన సాహిబా బాలీ ప్రస్తుతం సెలబ్రిటీ డేటింగ్ పుకార్లకు కేంద్రబిందువుగా మారారు. వీళ్లిద్దరూ కలిసి ఒక కేఫ్‌లో బహిరంగంగా కాఫీ తాగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.

Celebrity Dating : టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, నటి, స్పోర్ట్స్ ప్రజెంటర్ అయిన సాహిబా బాలీ ప్రస్తుతం సెలబ్రిటీ డేటింగ్ పుకార్లకు కేంద్రబిందువుగా మారారు. వీళ్లిద్దరూ కలిసి ఒక కేఫ్‌లో కాఫీ తాగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ చిన్న వీడియో క్లిప్ ఇన్‌స్టాగ్రామ్, X వంటి ప్లాట్‌ఫామ్స్‌లో చర్చకు తెరలేపింది.
ఈ ఫుటేజ్ వైరల్ అయిన వెంటనే, చాలా మంది నెటిజన్లు ఆ వీడియో కింద కామెంట్లు పెడుతూ సాహిబాను వాషింగ్టన్ సుందర్ గర్ల్‌ఫ్రెండ్ అని పిలవడం మొదలుపెట్టారు. పుకార్లు ఎంత పెరిగినా, వాషింగ్టన్ సుందర్ కానీ, సాహిబా బాలీ కానీ ఈ విషయంపై ఇప్పటి వరకు బహిరంగంగా ఎక్కడా స్పందించలేదు. సుందర్‌కు సన్నిహితంగా ఉన్న వర్గాలు చెబుతున్నదాని ప్రకారం.. అతను తన వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచడానికి ఇష్టపడతాడు. అందుకే అతను ఈ పుకార్లపై స్పందించడం లేదని తెలుస్తోంది. సాహిబా కూడా తమ మధ్య రొమాంటిక్ రిలేషన్‌షిప్ ఉందని సూచించేలా ఎలాంటి పోస్ట్‌లు పెట్టలేదు.

సాహిబా బాలీ ఎవరు?
సాహిబా బాలీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఒక రైజింగ్ మల్టీ-టాలెంటెడ్ సెలబ్రిటీ. ఈమె నటి, హోస్ట్, డిజిటల్ క్రియేటర్, మార్కెటింగ్ నిపుణురాలు కూడా. డిసెంబర్ 5, 1994 న కాశ్మీరీ కుటుంబంలో జన్మించిన సాహిబా, ఢిల్లీ యూనివర్సిటీలో ఎకనామిక్స్ చదివారు. అక్కడ థియేటర్, వీధి నాటకాలలో చురుకుగా పాల్గొన్నారు. మార్కెటింగ్ రంగంలో అనుభవం ఉన్నా, ఆమె వెండితెరపైకి మారి, సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటించారు.
2024 లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ బ్రాడ్‌కాస్ట్ టీమ్‌లో చేరిన తర్వాత సాహిబా బాగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో కూడా క్రికెట్‌కు సంబంధించిన డిజిటల్ కంటెంట్ యాంకర్‌గా పనిచేశారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో సాహిబా చాలా చురుకుగా ఉంటూ, లైఫ్‌స్టైల్, హాస్యం, కెరీర్ సలహాల వంటి విషయాలను పోస్ట్ చేస్తూ, పెద్ద సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకున్నారు.
ప్రస్తుతానికి సుందర్ అంతర్జాతీయ క్రికెట్ విధుల్లో, సాహిబా తన స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ పనులలో నిమగ్నమై ఉన్నారు. వారిద్దరూ తమ వృత్తిపరమైన బాధ్యతలపైనే దృష్టి పెట్టారు.




