AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KL Rahul : క్లాస్ కాదు మాస్..డేవిడ్ మిల్లర్‌కు టెన్షన్ పెంచిన కేఎల్ రాహుల్..అద్భుతమైన ఫినిషింగ్‌తో రికార్డు!

భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ కేవలం 43 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్ ఆడి, టీమిండియా స్కోరును 350 మార్కు దాటించాడు.

KL Rahul : క్లాస్ కాదు మాస్..డేవిడ్ మిల్లర్‌కు టెన్షన్ పెంచిన కేఎల్ రాహుల్..అద్భుతమైన ఫినిషింగ్‌తో రికార్డు!
Kl Rahul
Rakesh
|

Updated on: Dec 03, 2025 | 8:07 PM

Share

KL Rahul : భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ కేవలం 43 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్ ఆడి, టీమిండియా స్కోరును 350 మార్కు దాటించాడు. మొదటి మ్యాచ్‌లోనూ (60 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడిన రాహుల్, ఈ సిరీస్‌లో డెత్ ఓవర్లలో కీలక పరుగులు చేయడంలో తనను తాను అత్యుత్తమ ఫినిషర్‌గా నిరూపించుకుంటున్నాడు.

డెత్ ఓవర్లలో ప్రపంచ రికార్డు

కేఎల్ రాహుల్ ఇప్పుడు వన్డే ఇంటర్నేషనల్స్ లో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. 2023 నుంచి డెత్ ఓవర్లలో (అంటే 41 నుంచి 50 ఓవర్ల మధ్య) అత్యధిక పరుగులు చేసిన ప్రపంచంలోనే మూడో బ్యాట్స్‌మెన్గా నిలిచాడు. ఈ గణాంకాలు అతని ఫినిషింగ్ సామర్థ్యాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. రాహుల్ 2023 నుంచి 142.76 స్ట్రైక్ రేట్‌తో డెత్ ఓవర్లలో మొత్తం 424 పరుగులు సాధించాడు. ఈ విషయంలో అతను అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాట్స్‌మెన్గా రికార్డు సృష్టించాడు.

రికార్డుల లిస్ట్

ఈ అత్యధిక పరుగుల జాబితాలో దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ 168.11 స్ట్రైక్ రేట్‌తో 464 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. శ్రీలంకకు చెందిన చరిత్ అసలంక 147.97 స్ట్రైక్ రేట్‌తో 438 పరుగులతో రెండో స్థానంలో ఉండగా, కేఎల్ రాహుల్ 424 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌కు చెందిన గ్లెన్ ఫిలిప్స్ (413 పరుగులు) నాలుగో స్థానంలో ఉన్నాడు.

సిరీస్‌పై భారత్ పట్టు

దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ రెండు వన్డేల్లోనూ భారత బ్యాట్స్‌మెన్‌లు భారీ స్కోర్లు నమోదు చేశారు. మొదటి మ్యాచ్‌లో 349 పరుగులు చేసిన భారత్, రెండో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (102), రుతురాజ్ గైక్వాడ్ (105) సెంచరీలతో పాటు కేఎల్ రాహుల్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా 358 పరుగుల భారీ టార్గెట్‌ను సఫారీలకు ఇచ్చింది. ఈ భారీ స్కోర్‌ను గనుక రాయ్‌పూర్‌లో భారత్ డిఫెండ్ చేసుకోగలిగితే, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకుని అజేయ ఆధిక్యాన్ని సాధిస్తుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్