AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG : గాయాలతో టీమిండియా సతమతం.. గిల్ గంభీర్ ముందున్న 6 సవాళ్లు ఇవే

ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక పెద్ద సవాలుగా మారింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, గౌతమ్ గంభీర్ లు కరుణ్ నాయర్ ఫామ్, రిషబ్ పంత్ ఫిట్‌నెస్, గాయపడిన ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేయడంపై నిర్ణయాలు తీసుకోవాలి.

IND vs ENG : గాయాలతో టీమిండియా సతమతం.. గిల్ గంభీర్ ముందున్న 6 సవాళ్లు ఇవే
Ind Vs Eng 4th Test
Rakesh
|

Updated on: Jul 22, 2025 | 2:16 PM

Share

IND vs ENG : ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో నాలుగో టెస్ట్ జూలై 23న జరగనుంది. భారత జట్టు ఇప్పటికే సిరీస్‌లో 1-2తో వెనుకబడి ఉంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు, టీమిండియాకు కొన్ని సమస్యలు వచ్చిపడ్డాయి. ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి సిరీస్ మొత్తానికి గాయం కారణంగా దూరం కాగా, యువ పేసర్ అర్షదీప్ సింగ్ నాలుగో టెస్టు ఆడటం లేదు. ఆకాష్ దీప్ ఫిట్‌నెస్ కూడా అనుమానమే. ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ లకు ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవడం పెద్ద తలనొప్పిగా మారింది.

గిల్-గంభీర్ ముందున్న 6 పెద్ద ప్రశ్నలు ఇవే

ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టుకు జట్టును ఎంపిక చేయడం గిల్, గంభీర్ లకు చాలా కష్టంగా మారింది. కొందరు ఆటగాళ్లు గాయాల వల్ల దూరమయ్యారు. మరికొందరు ఫామ్‌లో లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవర్ని తప్పించాలి, ఎవర్ని తీసుకోవాలి అనే నిర్ణయం తీసుకోవడం చాలా కీలకం.

కరుణ్ నాయర్ పై ఏ నిర్ణయం తీసుకుంటారు?

కరుణ్ నాయర్ ఈ సిరీస్‌లో పెద్దగా రాణించలేదు. ఆరు ఇన్నింగ్స్‌లలో కేవలం 131 పరుగులు మాత్రమే చేశాడు, ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు. కాబట్టి, టీమిండియా అతన్ని తప్పించి సాయి సుదర్శన్‎ను తిరిగి జట్టులోకి తీసుకురావచ్చా అనేది చూడాలి.

రిషబ్ పంత్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ?

రిషబ్ పంత్ గత మ్యాచ్‌లో గాయపడ్డాడు. దాని తర్వాత వికెట్ కీపింగ్ చేయలేదు. అయితే, ఇటీవల అతను దాదాపు 10 రోజుల తర్వాత వికెట్ కీపింగ్ చేస్తూ కనిపించాడు. ఒకవేళ అతను పూర్తిగా ఫిట్‌గా లేకపోతే, టీమిండియా అతన్ని కేవలం బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే ఆడించవచ్చు. అప్పుడు వికెట్ కీపింగ్ బాధ్యతలు ధ్రువ్ జురెల్ లేదా కేఎల్ రాహుల్ లపై పడతాయి.

నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో ఎవరు?

నితీష్ కుమార్ రెడ్డి గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో జట్టులో ఎవరు చేరతారనేది ఆసక్తికరంగా మారింది. ఇది ఒక కొత్త ఆటగాడికి అవకాశం కల్పిస్తుంది.

ఆకాష్ దీప్ ఫిట్‌గా ఉన్నాడా లేదా?

ఆకాష్ దీప్ కూడా గాయం సమస్యలతో బాధపడుతున్నాడు. మొహమ్మద్ సిరాజ్ చెప్పిన దాని ప్రకారం, ఆకాష్ దీప్‌కు గజ్జల్లో సమస్య ఉంది. అయితే, నాలుగో టెస్టుకు ఆకాష్ ఫిట్‌గా ఉన్నాడా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. అతని ఫిట్‌నెస్ పైనే బౌలింగ్ విభాగం బలం ఆధారపడి ఉంటుంది.

కుల్దీప్ యాదవ్‎ను టీమ్‌లో తీసుకుంటారా?

టీమిండియా ముందున్న అతి పెద్ద ప్రశ్నల్లో ఇది ఒకటి. కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకుంటారా? మాంచెస్టర్ పిచ్ స్లోగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి పిచ్‌లపై స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి, భారత జట్టు కుల్దీప్‌ను ఆడించే ఆలోచన చేయవచ్చు.

అన్షుల్ కంబోజ్ అరంగేట్రం చేస్తాడా?

అర్షదీప్ సింగ్ స్థానంలో అన్షుల్ కంబోజ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఒకవేళ ఆకాష్ దీప్ నాలుగో టెస్టుకు అందుబాటులో లేకపోతే, కంబోజ్ తన అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఉందా అనేది ఇప్పుడు అందరిలోనూ ఉన్న ప్రశ్న.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌