AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manoj Tiwary: మళ్లీ ఆడతా.. 5 రోజులకే రిటైర్మెంట్‌ను వెనక్కు తీసుకున్న టీమిండియా క్రికెటర్‌.. కారణమిదే

ఐదు రోజుల క్రితం తన సోషల్ మీడియా ఖాతాలో క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన బెంగాల్ క్రీడా మంత్రి, టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ.. ఇప్పుడు రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. మళ్లీ క్రికెట్‌ ఆడతానంటూ ముందుకొచ్చాడు. తన రిటైర్మెంట్‌ నిర్ణయం హఠాత్తుగా తీసుకున్నానని, ఇందుకు అభిమానులు క్షమించాలన్నాడు..

Manoj Tiwary: మళ్లీ ఆడతా.. 5 రోజులకే రిటైర్మెంట్‌ను వెనక్కు తీసుకున్న టీమిండియా క్రికెటర్‌.. కారణమిదే
Manoj Tiwary
Basha Shek
|

Updated on: Aug 10, 2023 | 5:55 AM

Share

ఐదు రోజుల క్రితం తన సోషల్ మీడియా ఖాతాలో క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన బెంగాల్ క్రీడా మంత్రి, టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ.. ఇప్పుడు రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. మళ్లీ క్రికెట్‌ ఆడతానంటూ ముందుకొచ్చాడు. తన రిటైర్మెంట్‌ నిర్ణయం హఠాత్తుగా తీసుకున్నానని, ఇందుకు అభిమానులు క్షమించాలన్నాడు. నిజానికి గత రంజీ ప్రారంభానికి ముందు తన రిటైర్మెంట్ గురించి మాట్లాడిన మనోజ్.. రంజీ ట్రోఫీ గెలిచిన తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటానని చెప్పాడు. అయితే గత రంజీ ఫైనల్లో బెంగాల్ సౌరాష్ట్ర చేతిలో ఓడి చాంపియన్ టైటిల్‌ను కోల్పోయింది. ఆ తర్వాత కూడా మనోజ్ తన రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఐదు రోజుల క్రితం మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ అందరినీ షాక్ కి గురి చేసింది. ఈ పోస్ట్‌లో మనోజ్ క్రికెట్‌కు దూరమవుతున్నట్లు తెలిపాడు. అయితే ఇప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటించిన ఐదు రోజుల తర్వాత నిరసన సభ నిర్వహించిన మనోజ్.. అందరి ప్రేమ, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధికారుల విజ్ఞప్తి మేరకు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు పేర్కొన్నాడు. తన తొందరపాటు నిర్ణయంపై తన అభిమానులు, మద్దతుదారులకు క్షమాపణలు కూడా చెప్పాడు.

నా భార్య కూడా నిరాశకు లోనైంది..

తాజాగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్నేహశీస్ గంగోపాధ్యాయ మాట్లాడుతూ, ‘మనోజ్ రిటైర్మెంట్ గురించి విన్న తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత ఆయనతో మాట్లాడాను. దాదాపు రెండు దశాబ్దాలు బెంగాల్ తరఫున ఆడిన నేను ఇలా రిటైరవడం సరికాదన్న నమ్మకం కలిగింది. తనలాంటి క్రికెటర్, హీరో ఇలా రిటైరవడం సరికాదు. బెంగాలీ క్రికెట్‌కు అతని సహకారం ఎనలేనిది’ అన్నారు. ఇదే సమావేశంలో మాట్లాడిన మనోజ్‌ ‘ నేను హఠాత్తుగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం పట్ల నా కుటుంబ సభ్యులు కూడా అసంతృప్తితో ఉన్నారు. సహచరులు, మద్దతుదారులు కూడా నిరాశ చెందారు. సోషల్ మీడియాలో రిటైర్మెంట్ ప్రకటించడంతో నా భార్య కూడా నిరాశకు లోనైంది. ఆ తర్వాత స్నేహశీస్ దార్ నాతో మాట్లాడి బెంగాల్ తరఫున మరో సీజన్ ఆడేందుకు నన్ను ఒప్పించాడు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ నుండి నాకు లభించిన ప్రేమ, గౌరవాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను. ఈ అనాలోచిత నిర్ణయానికి బెంగాల్ క్రికెట్ అభిమానులందరికీ , నా శ్రేయోభిలాషులందరికీ క్షమాపణలు చెబుతున్నాను. కొత్త సీజన్‌లో బెంగాల్ క్రికెట్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను’ అని చెప్పుకొచ్చాడు మనోజ్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..