ICC ODI Ranking: ఐసీసీ వన్డే ర్యాకింగ్స్‌లో అదరగొట్టిన రోహిత్, విరాట్.. బాబర్‌కు షాకివ్వనున్న భారత ఫ్యూచర్ స్టార్..

ICC ODI Batters and Bowlers Rankings: కొత్త వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ టెన్‌లో ఐదుగురు భారత ఆటగాళ్లు కనిపించడం విశేషం. అంటే టాప్-10 బ్యాట్స్‌మెన్ జాబితాలో ముగ్గురు ఆటగాళ్లు ఉండగా, బౌలర్ల జాబితాలో ఇద్దరు భారత ఆటగాళ్లు ఉన్నారు. ఆసియా కప్‌లో అదరగొడుతూ, ఐసీసీ వన్డే ర్యాకింగ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ముఖ్యంగా విరాట్, రోహిత్ శర్మలు టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్నారు. దీంతో మొత్తంగా వన్డే బ్యాటర్స్ జాబితాలో ముగ్గురు భారత్ నుంచి ఉన్నారు.

ICC ODI Ranking: ఐసీసీ వన్డే ర్యాకింగ్స్‌లో అదరగొట్టిన రోహిత్, విరాట్.. బాబర్‌కు షాకివ్వనున్న భారత ఫ్యూచర్ స్టార్..
Team India Icc Odi Ranks

Updated on: Sep 13, 2023 | 4:09 PM

ICC ODI Batters Rankings: శ్రీలంక వేదికగా జరుగుతోన్న ఆసియా కప్‌లో టీమిండియా ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. దీంతో తాజాగా విడుదలైన ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్‌ల కొత్త ర్యాంకింగ్ జాబితాలోనూ తమ పంజా చూపించారు. కొత్త ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే, మరోవైపు టీం ఇండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తన కెరీర్‌లోనే బెస్ట్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆసియా కప్‌లో నేపాల్, పాకిస్థాన్‌లపై హాఫ్ సెంచరీలు సాధించిన గిల్.. ఇప్పుడు వన్డే ర్యాంకింగ్స్‌లో 3వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబాకాడు.

అలాగే గతేడాది టాప్-10లో చివరి స్థానంలో కనిపించిన విరాట్ కోహ్లీ ఈసారి రెండు స్థానాలు ఎగబాకాడు. అలాగే రోహిత్ శర్మ కూడా టాప్ టెన్ లో చోటు దక్కించుకోవడంలో సక్సెస్ అయ్యాడు.

టాప్-10లో ఐదుగురు భారతీయులు..

కొత్త వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ టెన్‌లో ఐదుగురు భారత ఆటగాళ్లు కనిపించడం విశేషం. అంటే టాప్-10 బ్యాట్స్‌మెన్ జాబితాలో ముగ్గురు ఆటగాళ్లు ఉండగా, బౌలర్ల జాబితాలో ఇద్దరు భారత ఆటగాళ్లు ఉన్నారు.

ICC ODI బ్యాటర్స్ ర్యాంకింగ్ జాబితా..

బాబర్ ఆజం (పాకిస్తాన్)- 863 రేటింగ్

శుభమాన్ గిల్ (భారతదేశం) – 759 రేటింగ్

రస్సీ వాండర్ డస్సెన్ (దక్షిణాఫ్రికా)- 745 రేటింగ్

డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)- 739 రేటింగ్

ఇమామ్-ఉల్-హక్ (పాకిస్తాన్)- 735 రేటింగ్

హ్యారీ టెక్టర్ (ఐర్లాండ్) – 726 రేటింగ్

క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా)- 721 రేటింగ్

విరాట్ కోహ్లీ (భారతదేశం)- 715 రేటింగ్

రోహిత్ శర్మ (భారతదేశం)- 707 రేటింగ్

ఫఖర్ జమాన్ (పాకిస్తాన్)- 705 రేటింగ్

ఐసీసీ బౌలర్ల టాప్-10 ర్యాంకింగ్స్ జాబితాలో టీమిండియాకు చెందిన ఇద్దరు బౌలర్లు చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ అగ్రస్థానంలో ఉండగా, టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 7వ స్థానంలో నిలిచాడు.

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్.. శ్రీలంకపై 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ అద్భుత ప్రదర్శనతో ఎడమచేతి వాటం స్పిన్నర్ టాప్-10లో చేరగలిగాడు. కాగా, టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ తన చివరి ర్యాంక్‌ను కొనసాగించాడు.

ఐసీసీ ర్యాకింగ్స్

ICC ODI బౌలర్ ర్యాంకింగ్ జాబితా..

జోష్ హాజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) – 692 రేటింగ్.

మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)- 666 రేటింగ్

ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్)- 666 రేటింగ్

ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా)- 663 రేటింగ్

మాట్ హెన్రీ (న్యూజిలాండ్)- 658 రేటింగ్

ముజీబ్ ఉర్ రెహ్మాన్ (ఆఫ్ఘనిస్తాన్)- 657 రేటింగ్

కుల్దీప్ యాదవ్ (భారతదేశం)- 656 రేటింగ్

రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్)- 655 రేటింగ్

మహ్మద్ సిరాజ్ (భారతదేశం)- 643 రేటింగ్

షాహీన్ అఫ్రిది (పాకిస్తాన్)- 635 రేటింగ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..