IND vs NZ, 3rd T20: టీమిండియా ఘన విజయం.. సమిష్టిగా రాణించిన రోహిత్ సేన.. ధోని, కోహ్లీకి సాధ్యం కాని రికార్డు నెలకొల్పిన హిట్‌మ్యాన్
టీమిండియా ఇచ్చిన 184 పరుగుల టార్గెట్‌ను న్యూజిలాండ్ ఏ దశలోనూ చేరుకోలేక పోయింది. భారత బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోతూ ఓడిపోయింది.
IND vs NZ, 3rd T20: టీమిండియా ఇచ్చిన 184 పరుగుల టార్గెట్‌ను న్యూజిలాండ్ ఏ దశలోనూ చేరుకోలేక పోయింది. భారత బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోతూ ఓడిపోయింది. అయితే ఈ మ్యాచులో టీమిండియా బ్యాట్స్‌మెన్స్, బౌలర్లు సమిష్టిగా రాణించి అద్భుత విజయం సొంతం చేసుకున్నారు. దీంతో న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన రోహిత్ సేన, ధోని, కోహ్లీలకు సాధ్యం కాని రికార్డును సాధించాడు. న్యూజిలాండ్ టీం కేవలం 17.2 ఓవర్లకు 111పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో రోహిత్ సేన 73 పరుగులతో ఘన విజయం సొంతం చేసుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ ముందు 185 భారీ లక్ష్యాన్ని ఉంచింది. కీలక మ్యాచులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ(56 పరుగులు, 31 బంతులు, 5 ఫోర్లు, 3 సిక్సులు), ఇషాన్ కిషన్(29 పరుగులు, 21 బంతులు, 6 ఫోర్లు)లు తొలి వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం వికెట్లు వెంటవెంటనే పడడంతో మిడిలార్డర్‌లో భారత్ చాలా ఇబ్బంది పడింది. సూర్యకుమార్ యాదవ్ 0, రిషబ్ పంత్ 4 వికెట్లు త్వరగా పడ్డాయి. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్(25 పరుగులు, 20 బంతులు, 2 ఫోర్లు), వెంకటేష్ అయ్యర్(20 పరుగులు, 15 బంతులు, 1 ఫోర్, 1 సిక్స్) మరో కీలక భాగస్వామ్యాన్ని అందించారు.
వీరిద్దరు పెవిలియన్ చేరిన తరువాత క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ 1, హర్షల్ పటేల్ 18 మూడో కీలక భాగస్వామ్యాన్ని(22 పురుగులు) టీమిండియాకు అందించారు. టీమిండియా హర్షల్ పటేల్ (18) రూపంలో ఏడో వికెట్‌ను కోల్పోయింది. లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో 18.3 ఓవర్‌లో 162 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. అయితే చివర్లో దీపక్ చాహర్(21 పరుగులు, 8 బంతులు, 2 ఫోర్లు, 1సిక్స్) కివీస్ బౌలర్లపై ప్రతాపంచూపించి బౌండరీలతో పరుగులు సాధించాడు. దీంతో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. చివరి ఓవర్లో మొత్తం 19 పరుగులు రాబట్టాడు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 3, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నే, లాకీ ఫెర్గూసన్, ఇష్ సోధి తలో వికెట్ పడగొట్టారు.
That’s that from the Eden Gardens as #TeamIndia win by 73 runs and clinch the series 3-0.
Scorecard – https://t.co/MTGHRx2llF #INDvNZ @Paytm pic.twitter.com/TwN622SPAz
— BCCI (@BCCI) November 21, 2021
Also Read: Watch Video: ధోనీ టీంమేట్‌కు సెల్యూట్ చేసిన రోహిత్ శర్మ.. ఎందుకో తెలుసా? వైరలవుతోన్న వీడియో