Rohit Sharma: హోప్స్ పెంచిన లోయర్ ఆర్డర్.. దక్షిణాఫ్రికాతోనే అసలైన పరీక్ష: రోహిత్ శర్మ
ఈ సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా తదుపరి టీ20 ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. వచ్చే నెలలో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది.
India Vs New Zealand 2021: టీమ్ ఇండియా రెగ్యులర్ టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ తన శకాన్ని అద్భుతంగా ప్రారంభించాడు. ప్రపంచ కప్ 2021 (ICC T20 World Cup 2021) నిరాశను అధిగమించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్‌ను 3-0తో ఓడించి భారత జట్టు క్లీన్ స్వీప్ చేసింది. నవంబర్ 21 ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో టీమ్ ఇండియా 73 పరుగుల భారీ తేడాతో టీ20 ప్రపంచకప్ 2021 రన్నరప్ కివీ జట్టును ఓడించింది. జట్టు సాధించిన ఈ విజయంతో ఎన్నో అంశాలు బయటపడ్డాయి. అయితే కెప్టెన్ రోహిత్ శర్మకు ఎక్కువగా నచ్చిన విషయం ఏమిటంటే లోయర్ ఆర్డర్ బ్యాటింగ్. మూడో టీ20లో జట్టు విజయం తర్వాత, కెప్టెన్ రోహిత్ మాట్లాడుతూ.. ఇతర జట్ల మాదిరిగానే ప్రస్తుతం తమ వద్ద కూడా టెయిలెండర్లు కూడా బ్యాటింగ్ చేస్తున్నారని పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ శుభారంభం చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో పాటు యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మిడిల్ ఓవర్లలో ఆ జట్టు పలు వికెట్లు కోల్పోయి భారీ స్కోరు సాధించలేదని అనిపించినా ఎనిమిది, తొమ్మిదో నంబర్ బ్యాట్స్‌మెన్ హర్షల్ పటేల్ (18), దీపక్ చాహర్ (21 నాటౌట్) వేగంగా ఆడడంతో భారత్ 184ల భారీ స్కోర్ చేసింది. చివరి ఐదు ఓవర్లలో 50 పరుగులు జోడించి భారీ విజయాన్ని నమోదు చేయడంలో దోహదపడ్డారు.
బ్యాటింగ్‌లో లోయర్ ఆర్డర్ పాత్ర కీలకం.. కోల్‌కతాలో ఈ విజయంతో భారత్ సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్‌ను గెలుచుకున్న తర్వాత, చాలా మంది కొత్త, యువ ఆటగాళ్లను నడిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సహకారంపై దృష్టిని ఆకర్షించాడు.
భారత కెప్టెన్ మాట్లాడుతూ.. “మేం మిడిల్ ఓవర్లలో బాగా రాణించగలిగాం. కానీ, మా లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ చేసిన విధానం పట్ల నేను సంతోషంగా ఉన్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జట్లను పరిశీలిస్తే.. లోయర్ ఆర్డర్‌లోనూ మంచి బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు. ఎనిమిదో, తొమ్మిదో నంబర్ బ్యాట్స్‌మెన్ ముఖ్యమైన పాత్ర పోషించగలరు. హర్షల్ హర్యానా తరఫున ఆడినప్పుడు ఓపెనింగ్ బ్యాటింగ్ చేశాడు. దీపక్ శ్రీలంకలో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే.
దక్షిణాఫ్రికాలో తదుపరి టీ20 సిరీస్.. ఈ సిరీస్‌లో న్యూజిలాండ్, భారత జట్టు పూర్తి స్థాయిలో సత్తా చాటలేకపోయాయి. ప్రపంచకప్ ముగిసిన వెంటనే నిర్వహించే ఈ సిరీస్‌లో కొందరు పెద్ద ఆటగాళ్లు కనిపించలేదు. అయితే ఇప్పుడు ఈ సిరీస్ తర్వాత, భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో తదుపరి టీ20 సిరీస్‌ను ఆడవలసి ఉంది. ఇది జనవరిలో జరగనుంది. ఆ సిరీస్‌లో జట్టులోని సీనియర్ ఆటగాళ్లు తిరిగి రావచ్చు.
One Happy Bunch! ?
Thank you Kolkata ?
Next Stop – Kanpur ? ?#TeamIndia #INDvNZ @Paytm pic.twitter.com/55Lfi7MnTR
— BCCI (@BCCI) November 21, 2021
Also Read: 13 ఫోర్లు, 2 సిక్సర్లతో తుఫాన్ ఇన్నింగ్స్.. సూపర్ సెంచరీతో బౌలర్ల ఊచకోత.. ఆ బ్యాటర్ ఎవరంటే.!