
Vaibhav Suryavanshis T20 Snub: ఆఫ్ఘానిస్తాన్ జట్టుతో జరిగిన టీ20 సిరీస్‌ను వైట్ వాష్ చేసిన భారత జట్టు స్వదేశంలో ఆతిధ్య జట్టుగా దుమ్మురేపింది. ఈ క్లీన్ స్వీప్‌తో భారత జట్టు తమ నైపుణ్యాన్ని మరోసారి చాటిచెప్పింది. అయితే, ఈ వరుస విజయాల వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ నడుస్తోంది. స్వ్కాడ్‌లో ఎంపికైన వైభవ్ సూర్యవంశీకి మాత్రం మొండిచేయి చూపించారు. కనీసం ఒక్క మ్యాచ్‌లోనూ ఆడించకుండా తీవ్రంగా నిరాశ పరిచారు. అందరికీ అవకాశం దక్కినప్పటికీ, బుడ్డోడిని మాత్రం బెంచ్‌కే పరిమితం చేయడం పలు విమర్శలకు దారితీస్తోంది. భారతదేశంలో తన తొలి మ్యాచ్ ఆడేందుకు బుడ్డోడు మరికొన్ని రోజుల వరకు వేచి చూడాల్సి వస్తోంది.
జింబాబ్వే టూర్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన వైభవ్ సూర్యవంశీ వచ్చిన ప్రతీ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. ఈ క్రమంలో అద్భుతమైన ఫాంలో ఉన్నాడు. అదే ఊపుతో ఆఫ్ఘానిస్తాన్ టూర్‌కి ఎంపికయ్యాడు. కానీ, 3 మ్యాచ్ సిరీస్‌లో కనీసం ఒక్క ఛాన్స్ కూడా అందుకోలేకపోయాడు. వైభవ్ ఇండియాలో తన తొలి మ్యాచ్ ఆడతాడని అటు ప్యాన్స్, ఇటు మాజీ ఆటగాళ్లు కూడా ఎంతగానో ఎదురుచూశారు. కానీ వారందరికీ నిరాశనే ఇచ్చాడు గంభీర్.
ఎక్కువమంది చదివినది: ఐపీఎల్ 2027 మినీ వేలానికి రంగం సిద్ధం.. ఎప్పుడు, ఎక్కడంటే..?
జింబాబ్వే టూర్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నా, వైభవ్ సూర్యవంశీకి మాత్రం ఒక్క అవకాశం ఇవ్వకపోవడంపై గౌతమ్ గంభీర్‌తో పాటు పలువురు నెటిజన్లు, క్రికెట్ విశ్లేషకులు టీమ్ మేనేజ్‌మెంట్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. టాప్ ఆర్డర్‌లో ఇప్పటికే ఉన్న ఆటగాళ్లలో ఒకరికి రెస్ట్ ఇచ్చి, వైభవ్‌కు అవకాశం ఇవ్వాల్సిందిగా నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఇది యువ ప్రతిభకు అన్యాయం చేయడమేనంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ విమర్శలకు సమాధానంగా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించడం గమనార్హం. ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, సంజూ శాంసన్ వంటి ఆటగాడిని పక్కన పెట్టడం తన కెరీర్‌లో అత్యంత కఠినమైన నిర్ణయమంటూ తేల్చిపారేశాడు. ప్రతిభ లేకుండా ఎవరూ వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలవలేరంటూ గత సందర్భాలను గుర్తు చేస్తూ, విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
వైభవ్ సూర్యవంశీ విషయంలో కూడా టీం మేనేజ్‌మెంట్‌కు స్పష్టత ఉందని గంభీర్ తెలిపాడు. వైభవ్ టాలెంట్ ఏమిటో తమకు తెలుసని, అయితే అతడు అవకాశం కోసం వేచి చూడాలని ఆయన పేర్కొనడం గమనార్హం. జట్టులో కొత్తగా చేరే వారికి తక్షణమే అవకాశం రావడం కష్టమని, గత కొన్నేళ్లుగా జట్టు తరపున అద్భుతంగా ఆడుతున్న వారికే తొలి ప్రాధాన్యత ఉంటుందని ఆయన స్పష్టం చేశాడు. అలాగే, ఏదో మూడు నాలుగు సార్లు విఫలమైనంత మాత్రాన ఆటగాళ్లు చెత్తగా మారిపోరని, ఒకే సిరీస్ ఫలితం ఆధారంగా జట్టును తక్కువ అంచనా వేయలేమని గంభీర్ వాదించాడు. ప్రస్తుతం వరల్డ్ కప్ కాంబినేషన్‌ను కొనసాగించడమే మంచిదని ఆయన సూచించడం విశేషం.
గంభీర్ వివరణ ఇచ్చిన్నప్పటికీ, నెటిజన్ల విమర్శలు ఏమాత్రం ఆగలేదు. స్క్వాడ్‌కి ఎంపిక చేసిన 15 మంది సభ్యులలో ఒక్క వైభవ్ సూర్యవంశీకి మాత్రమే అవకాశం ఇవ్వకపోవడం ఖచ్చితంగా అన్యాయమేనని చాలామంది అభిప్రాయపడ్డారు. టాప్ ఆర్డర్‌లో ఎవరో ఒకరికి రెస్ట్ ఇవ్వడం ద్వారా వైభవ్‌కు అవకాశం కల్పించి ఉంటే బాగుండేదని సూచించారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.