AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీమిండియాపై హీరో.. మిగతా జట్లపై జీరో.. వరుసగా 6 ఇన్నింగ్స్‌ల్లో బౌల్ట్.. ఎవరంటే?

Australia vs Zimbabwe 1st ODI: అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఆస్ట్రేలియా (Australia) డాషింగ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (Travis Head) మరోసారి నిరాశపరిచారు. జింబాబ్వే జట్టుతో జరుగుతున్న తొలి వన్డే పోరులో కేవలం 4 పరుగులకే బౌల్డ్ కావడం ద్వారా, ప్రొఫెషనల్ క్రికెట్‌లో వరుసగా ఆరోసారి క్లీన్ బౌల్డ్ అయిన విచిత్రమైన రికార్డును నమోదు చేశారు.

టీమిండియాపై హీరో.. మిగతా జట్లపై జీరో.. వరుసగా 6 ఇన్నింగ్స్‌ల్లో బౌల్ట్.. ఎవరంటే?
Travis Head Bowled Odi
Venkata Chari
|

Updated on: Sep 15, 2026 | 9:42 PM

Share

Australia vs Zimbabwe 1st ODI: జింబాబ్వే పర్యటనలో భాగంగా జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియా దూకుడైన ఓపెనర్ ట్రావిస్ హెడ్ స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. వేగంగా ఆడుతూ భారీ స్కోర్లు సాధించడంలో దిట్ట అయిన హెడ్, ఈ మ్యాచ్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే జింబాబ్వే పేస్ బౌలర్ బ్రాడ్ ఎవాన్స్ (Brad Evans) ఆఫ్ స్టంప్‌కు కొద్దిగా వెలుపల బ్యాక్ ఆఫ్ లెంగ్త్‌తో వేసిన బంతిని ఎదుర్కొనే ప్రయత్నంలో వికెట్ సమర్పించుకున్నారు. షాట్ ఆడేందుకు సరైన స్థలం లేకపోయినా స్క్వేర్ కట్ చేసే ప్రయత్నం చేయగా, బంతి బ్యాట్ లోపలి అంచును తాకుతూ నేరుగా స్టంప్స్‌ను కూల్చింది. కేవలం 10 పరుగుల స్కోరు వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోగా, ప్రొఫెషనల్ క్రికెట్‌లో హెడ్ వరుసగా ఆరోసారి బౌల్డ్ కావడం ఆయన టెక్నిక్‌లోని లోపాన్ని బయటపెట్టింది.

ఎక్కువమంది చదివినది: మేమైతే గెలిచాం.. అతనిపై ఇక నమ్మకం లేదు.. నెక్ట్స్ మ్యాచ్ నుంచి తీసేసుడే: శ్రేయాస్ అయ్యర్

గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League), ఆ తర్వాత బంగ్లాదేశ్ (Bangladesh) తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో ప్రారంభమైన ఈ ధోరణి ఇప్పుడు వన్డే ఫార్మాట్‌కు కూడా విస్తరించింది. అంతర్జాతీయ క్రికెట్ పరంగా చూస్తే వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌లలో ఆయన తన సొంత స్టంప్స్‌పైకే బంతిని లాక్కుంటూ బౌల్డ్ అయ్యారు. సరైన ఫుట్‌వర్క్ లేకుండా శరీరానికి దూరంగా షాట్లు ఆడే ప్రయత్నం చేయడంతో, బౌలర్లు నిరంతరం ఆఫ్ స్టంప్ లైన్‌లోనే బంతులు సంధిస్తూ ఫలితం రాబడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: వైభవ్ ఆటకట్టిస్తాం.. పక్కాప్లాన్‌తో దూల తీర్చేస్తాం..: జపాన్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..!

ఆయన ఆడిన గత 23 ప్రొఫెషనల్ ఇన్నింగ్స్‌లను పరిశీలిస్తే గణాంకాలు అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి. మొదటి 17 ఇన్నింగ్స్‌లలో ఆయన కేవలం క్యాచ్‌ల ద్వారా మాత్రమే ఔటవ్వగా, ఆ తర్వాతి ఆరు ఇన్నింగ్స్‌లలోనూ వరుసగా కేవలం బౌల్డ్ రూపంలోనే వికెట్ కోల్పోయారు. ఆస్ట్రేలియా మేనేజ్‌మెంట్‌తో పాటు బ్యాటింగ్ కోచ్‌లలో చర్చకు దారితీసింది. ఆఫ్ స్టంప్ ఆవల వచ్చే బంతుల ఎంపికలో మార్పు చేసుకోకపోతే రాబోయే మ్యాచ్‌లలో ప్రత్యర్థి జట్లు ఇదే వ్యూహంతో మరింత ఒత్తిడి తెచ్చే ప్రమాదం కనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us