AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: 300 వికెట్లు తీస్తేనే నీతో పెళ్లి.. టీమిండియా క్రికెటర్‌కు కండీషన్ పెట్టిన సినీ నటి.. ఎవరో తెలుసా?

Team India Crikcet Love Story: క్రికెట్, బాలీవుడ్ మధ్య సంబంధం కొత్తది కాదు. అప్పుడప్పుడు, రెండు ప్రపంచాల నుంచి వచ్చిన తారలు ఒకరిపై ఒకరు ఇష్టపడడం, ప్రేమలో కూరుకపోవడం ఇప్పటికే చూశాం. చాలాసార్లు ఈ సంబంధాలు వివాహం వరకు చేరుకున్నాయి. అలాంటి ఓ ఆసక్తికరమైన, అందమైన కథ భారత జట్టులో ఉంది.

Team India: 300 వికెట్లు తీస్తేనే నీతో పెళ్లి.. టీమిండియా క్రికెటర్‌కు కండీషన్ పెట్టిన సినీ నటి.. ఎవరో తెలుసా?
Team India Player Love Story
Venkata Chari
|

Updated on: Aug 22, 2025 | 8:36 PM

Share

Harbhajan Singh Geeta Basra love story: క్రికెట్, బాలీవుడ్ మధ్య సంబంధం కొత్తది కాదు. అప్పుడప్పుడు, రెండు ప్రపంచాల నుంచి వచ్చిన తారలు ఒకరిపై ఒకరు ఇష్టపడడం, ప్రేమలో కూరుకపోవడం ఇప్పటికే చూశాం. చాలాసార్లు ఈ సంబంధాలు వివాహం వరకు చేరుకున్నాయి. అలాంటి ఓ ఆసక్తికరమైన, అందమైన కథ భారత జట్టులో ఉంది. టీం ఇండియా స్టార్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, బాలీవుడ్ నటి గీతా బాస్రాల ప్రేమకథ వింటే కూడా షాక్ అవుతారు. ఎన్నో ఒడిదుడుకుల తర్వాత సుఖాంతం అయ్యింది.

హర్భజన్ సింగ్ తొలిసారి గీతా బాస్రాను 2007 ఇంగ్లాండ్ పర్యటనలో కలిశాడు. హర్భజన్ సింగ్, గీతా ఒక ఉమ్మడి స్నేహితుడి పార్టీలో కలుసుకుని నంబర్లు మార్చుకున్నారు. వీరు నెమ్మదిగా మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఈ సంభాషణ స్నేహంగా మారింది. ఆ సమయంలో వీరిద్దరూ తమ కెరీర్‌లతో బిజీగా ఉన్నప్పటికీ, వారు ఒకరితో ఒకరు సమయం గడపడం కొనసాగించారు.

హర్భజన్, గీత దాదాపు 8 సంవత్సరాలుగా తమ సంబంధాన్ని ప్రపంచానికి దాచిపెట్టారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక వైపు, గీత తన కెరీర్ గురించి సీరియస్‌గా ఉండేది. మరోవైపు, హర్భజన్ తన క్రికెట్ కెరీర్‌లో అత్యున్నత స్థాయిలో ఉన్నాడు. వారి ప్రేమ వ్యవహారం గురించి తరచుగా మీడియాలో వార్తలు వచ్చేవి. కానీ, గీత ఎప్పుడూ తాము “మంచి స్నేహితులు” అని చెప్పేది. దాదాపు 8 సంవత్సరాలుగా సంబంధంలో ఉన్న తర్వాత, హర్భజన్, గీత చివరకు 2015లో తమ సంబంధాన్ని వివాహంగా ప్రకటించుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఇవి కూడా చదవండి

హర్భజన్ స్వస్థలం జలంధర్‌లో పంజాబీ సంప్రదాయాలతో వివాహం జరిగింది. ఆ తర్వాత ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ జరిగింది. దీనికి క్రికెట్, సినిమా పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు.

గీత సినిమాలకు దూరంగా ఉండి, ఇప్పుడు తన కుటుంబంపై పూర్తి శ్రద్ధ చూపుతోంది. మరోవైపు, క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత హర్భజన్ సింగ్ వ్యాఖ్యానం, రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టారు. ప్రేమలో సహనం, అవగాహన, పరస్పర గౌరవం ఎంత ముఖ్యమో హర్భజన్, గీతల ప్రేమకథ మనకు నేర్పుతుంది.

పెళ్లికి ముందు గీత భజ్జీకి ఒక షరతు పెట్టింది. “నువ్వు 300 వికెట్లు తీస్తే, నేను నీ ప్రతిపాదనను అంగీకరిస్తాను” అని చెప్పింది. ఆ విధంగా, హర్భజన్ చివరకు ఆ లక్ష్యాన్ని సాధించి ఆమె ప్రేమను గెలుచుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..