Sanjana Ganesan: బాడీ షేమింగ్ బారిన బుమ్రా భార్య.. దిమ్మతిరిగే రిప్లైతో కౌంటర్ ఎటాక్.. ఏమందంటే?

Jasprit Bumrah Wife Sanjana Ganesan: సంజనా గణేశన్ స్పోర్ట్స్ యాంకర్ అనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బుమ్రాను పెళ్లి చేసుకోకముందే ఆమె గురించి జనాలకు తెలుసు. బుమ్రాతో రిలేషన్‌షిప్ తరువాత, వారిద్దరూ మార్చి 2021 లో వివాహం చేసుకున్నారు. బుమ్రా, సంజన గతేడాది సెప్టెంబర్‌లో తల్లిదండ్రులు అయ్యారు. వీళ్లకు కొడుకు పుట్టాడు.

Sanjana Ganesan: బాడీ షేమింగ్ బారిన బుమ్రా భార్య.. దిమ్మతిరిగే రిప్లైతో కౌంటర్ ఎటాక్.. ఏమందంటే?
Sanjana Ganesan
Follow us

|

Updated on: Feb 13, 2024 | 2:59 PM

Sanjana Ganesan Trolled: భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేశన్ సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ బాధితురాలిగా మారింది. వాస్తవానికి, ఇన్‌స్టాగ్రామ్‌లో పెయిడ్ ప్రమోషన్ వీడియోను పోస్ట్ చేసింది. ఆ తర్వాత, సంజన ఒక వినియోగదారు నుంచి అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే, ఈ విషయంలో సంజన ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ వినియోగదారుని వదిలిపెట్టలేదు. ఏకిపారేసింది. సంజన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఏకిపారేసిన సంజన..

సంజనా గణేశన్ ఇటీవల ఒక కొడుకుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె బరువు మునుపటిలా పెరిగింది. సంజన ఈ వీడియోపై ఒక యూజర్ ఆమెను లావుగా ఉన్నావంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. సంజన.. ఆ యూజర్‌కి రిప్లై ఇస్తూ.. మీకు స్కూల్ సైన్స్ పాఠ్యపుస్తకం కూడా గుర్తుండదని, పెద్ద పెద్ద ఆడవాళ్ల శరీరాల గురించి వ్యాఖ్యానిస్తుంటారని ఫైర్ అయింది. ఇక్కడి నుంచి పారిపో అంటూ యూజర్‌పై విరుచుకపడింది.

సంజన వీడియోపై నెటిజన్ల రియాక్షన్..

View this post on Instagram

A post shared by jasprit bumrah (@jaspritb1)

సంజన వీడియోపై వ్యాఖ్యానిస్తూ, రాజా రాయ్ అనే వినియోగదారు “భాభి లావుగా కనిపిస్తున్నావు” అంటూ రాసుకొచ్చాడు. సంజన వీడియోపై ఈ యూజర్ మాత్రమే కాకుండా ఇతర వ్యక్తులు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ అనే వినియోగదారుడు సోదరా, ఆమె చాలా లావుగా మారింది. ఇంతకుముందు ఇలా లేదు అంటూ మాట్లాడుకున్నారు. సంజన చెప్పిన సమాధానంపై అంతా నిజమే కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. గర్భం దాల్చిన తర్వాత స్త్రీ బరువు పెరగడం సహజం కదా అంటూ మద్దతు తెలుపుతున్నారు.

2021లో బుమ్రా, సంజన వివాహం..

సంజనా గణేశన్ స్పోర్ట్స్ యాంకర్ అనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బుమ్రాను పెళ్లి చేసుకోకముందే ఆమె గురించి జనాలకు తెలుసు. బుమ్రాతో రిలేషన్‌షిప్ తరువాత, వారిద్దరూ మార్చి 2021 లో వివాహం చేసుకున్నారు. బుమ్రా, సంజన గతేడాది సెప్టెంబర్‌లో తల్లిదండ్రులు అయ్యారు. వీళ్లకు కొడుకు పుట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..