IPL 2024: ‘ఆ ఫాస్ట్ బౌలర్‌కే కాదు.. బుమ్రా, కోహ్లీ, రోహిత్‌లకు కూడా అంత సీన్ లేదు..’
ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యం రూ. 24.75 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అతడు ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధర పలికిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యం రూ. 24.75 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అతడు ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధర పలికిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇక ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. తాజాగా టీమిండియా దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కేకేఆర్ మేనేజ్‌మెంట్.. మిచెల్ స్టార్క్‌పై అంత పెద్ద మొత్తాన్ని వెచ్చించడం తనకు అతిశయోక్తిగా అనిపించిందన్నారు.
ఒక్క స్టార్క్ మాత్రమే కాదు.. ఏ క్రికెటర్ కూడా అంత మొత్తం తీసుకోవడానికి అర్హుడు కాదని గవాస్కర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో స్టార్క్ కనీసం నాలుగింటిలోనైనా ప్రభావం చూపితే.. తాను తీసుకుంటున్న డబ్బుకు న్యాయం చేసినట్టు అవుతుందన్నారు గవాస్కర్. అలాగే మిగతా మ్యాచ్‌ల్లో కూడా అద్భుతంగా ఆడినట్లయితే.. అది అమోఘమని అభివర్ణించాడు. ముంబై, చెన్నై, ఆర్సీబీ జట్లలో ఎంతోమంది మేటి బ్యాటర్లు ఉన్నారు. ఆయా జట్లపై స్టార్క్ బంతితో తన ప్రభావం చూపిస్తే.. తన ఫ్రాంచైజీ వెచ్చించిన మొత్తానికి న్యాయం చేసినవాడవుతాడని గవాస్కర్ స్పష్టం చేశాడు.
కాగా 2014, 2015 సీజన్లలో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించిన స్టార్క్.. ఆ తర్వాత 2018లో కోల్‌కతాకు మారాడు. అప్పుడు కేకేఆర్ అతడిని రూ. 9.40 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఇక వన్డే వరల్డ్‌కప్-2023లో స్టార్క్ మొత్తంగా ఆడిన 10 మ్యాచ్‌లలో 16 వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో ఐపీఎల్ 2024 మినీ వేలంలో అతడికి జాక్‌పాట్ తగిలింది.