Virat Kohli Video: విరాట్ కోహ్లీపై నిషేధం లేదా జరిమానా.. 19 ఏళ్ల కుర్రాడితో గొడవ.. రంగంలోకి ఐసీసీ?

|

Dec 26, 2024 | 8:46 AM

Virat Kohli Banned or Fined: మెల్‌బోర్న్ టెస్టు తొలి రోజు ఆట తొలి సెషన్‌లోనే విరాట్ కోహ్లీ వివాదంలో చిక్కుకునే ఛాన్స్ ఉంది. మైదానంలో జరిగిన ఓ ఘనటతో కోహ్లీపై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకు గల కారణం ఓసారి చూద్దాం..

Virat Kohli Video: విరాట్ కోహ్లీపై నిషేధం లేదా జరిమానా.. 19 ఏళ్ల కుర్రాడితో గొడవ.. రంగంలోకి ఐసీసీ?
Konstas Vs Kohli Issue Vide
Follow us on

Virat Kohli Banned or Fined: విరాట్ కోహ్లీపై నిషేధం లేదా జరిమానా విధిస్తారా? ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందని మీరు ఆశ్చర్యపోవచ్చు? ఈ సంఘటన డిసెంబర్ 26 తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఉష్టోగ్రతలు దాదాపు 40 డిగ్రీలు దాటాయి. మెల్‌బోర్న్‌లో బాక్సింగ్ డే టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేస్తోంది. 19 ఏళ్ల ఓపెనర్ సామ్ కాన్స్టాన్స్ అరంగేట్రంలో తన సత్తా చూపడాన్ని ప్రపంచం చూస్తోంది. కానీ, ఇంతలో, విరాట్ కాన్స్టాస్‌ను తన భుజంతో గట్టిగా ఢీ కొట్టాడు. దీంతో వివాదం తలెత్తింది. విరాట్ కోహ్లీ, సామ్ కాన్స్టాస్‌ గురించి చర్చలు మొదలయ్యాయి.

విరాట్ కోహ్లి ఏం చేశాడంటే?

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 10వ ఓవర్ ముగిసిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. ఓవర్ ముగిసిన వెంటనే, విరాట్ కోహ్లీ ముందు నుంmr వచ్చి సామ్ కాన్స్టాన్స్‌ను ఢీ కొట్టాడు. అనంతరం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే, విరాట్‌ కోహ్లి ఉద్దేశపూర్వకంగా ఇలా చేశాడా, తెలియక చేశాడా అనే దానిపై ఐసీసీ విచారణ చేపట్టనుంది.

ఐసీసీ విచారణ జరపాలన్న పాంటింగ్..

ఈ విషయానికి సంబంధించి ఏదైనా నిర్ధారణకు రావడానికి ఐసీసీ రంగంలోకి దిగాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ పాంటింగ్ కోరుతున్నాడు. అయితే విరాట్ కోహ్లీదే తప్పని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ భావిస్తున్నాడు.

విరాట్ మొత్తం పిచ్‌పై నడుస్తున్నాడని, అతనే కావలని తప్పు చేశాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఏం జరిగిందో అంపైర్, రిఫరీ కూడా చూశారని నేను ఆశిస్తున్నాను అంటూ మాజీ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. కాన్స్టాస్ విషయానికొస్తే.. ఎదురుగా ఎవరో వస్తున్నారని ఆలస్యంగా గ్రహించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ జోక్యం చేసుకుంటారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

విరాట్ 3-4 డీమెరిట్ పాయింట్లు కోల్పోవచ్చు..

ఐసీసీ నిబంధనల ప్రకారం క్రికెట్‌లో శారీరకంగా ఢీ కొట్టడం నిషేధం. ఇటువంటి సంఘటనలలో ఆటగాడు లెవెల్ 2 కింద దోషిగా పరిగణించే ఛాన్స్ ఉంది. విచారణలో, విరాట్ లేదా కాన్‌స్టాన్స్‌లో ఎవరిలో తప్పు కనిపించినా 3 నుంచి 4 డిమెరిట్ పాయింట్లు విధించే ఛాన్స్ ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..