IND vs SA: షాకింగ్ న్యూస్.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ నుంచి బుమ్రా ఔట్.. ఎందుకంటే?
Jasprit Bumrah: టీమిండియా (Team India) స్టార్ పేసర్ అయిన బుమ్రా గత కొంతకాలంగా గాయాల నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చారు. ప్రస్తుతం భారత్ ముందు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC)లో భాగమైన ముఖ్యమైన టెస్ట్ సిరీస్‌లు, ఆ తరువాత ప్రధాన టోర్నమెంట్‌లు ఉండడంతో, అతని ఆరోగ్యాన్ని, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

India vs South Africa, 1st Test: కోల్‌కతాలో మొదలైన తొలి టెస్ట్‌లో తొలిరోజు ముగియకుండానే సౌతాఫ్రికా జట్టు 159 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో చెలరేగడంతో సౌతాఫ్రికా జట్టు ఏ దరశలోను కోలుకోలేదు. అయితే, టెస్ట్ సిరీస్ తర్వాత వన్డే సిరీస్ మొదలుకానుంది. ఈ సిరీస్ నుంచి బుమ్రా తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. అతని వర్క్‌లోడ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ వన్డే సిరీస్ నుంచి అతనికి విశ్రాంతి ఇవ్వాలని జట్టు యాజమాన్యం, సెలెక్టర్లు యోచిస్తున్నట్లు సమాచారం.
ఆటగాళ్ల ఫిట్‌నెస్ ముఖ్య ఉద్దేశం..
టీమిండియా (Team India) స్టార్ పేసర్ అయిన బుమ్రా గత కొంతకాలంగా గాయాల నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చారు. ప్రస్తుతం భారత్ ముందు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC)లో భాగమైన ముఖ్యమైన టెస్ట్ సిరీస్‌లు, ఆ తరువాత ప్రధాన టోర్నమెంట్‌లు ఉండడంతో, అతని ఆరోగ్యాన్ని, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నిరంతరంగా క్రికెట్ ఆడడం వల్ల గాయాలు తిరగబెట్టే ప్రమాదం ఉన్నందున, సుదీర్ఘ ఫార్మాట్‌పై దృష్టి సారించేందుకు బుమ్రాకు వన్డే సిరీస్ నుంచి విరామం ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సిరీస్ షెడ్యూల్..
భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగబోయే ద్వైపాక్షిక సిరీస్ షెడ్యూల్..
టెస్ట్ సిరీస్: నవంబర్ 14 నుంచి (రెండు టెస్టులు)
వన్డే సిరీస్: నవంబర్ 30 నుంచి (మూడు వన్డేలు)
టీ20 సిరీస్: డిసెంబర్ 9 నుంచి (ఐదు టీ20లు)
ముందుగా టెస్ట్ సిరీస్‌లో ఆడి, ఆ వెంటనే వన్డే సిరీస్‌లో పాల్గొనడం వల్ల వచ్చే భారాన్ని తగ్గించేందుకే బుమ్రాకు వన్డేల నుంచి విశ్రాంతి ఇచ్చే నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
యువ పేసర్లకు అవకాశం..
బుమ్రాకు విశ్రాంతినిస్తే, టీమిండియాలో ఉన్న మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్ లేదా ఆకాశ్ దీప్ వంటి యువ పేసర్లకు దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్టుపై తమ సత్తా నిరూపించుకోవడానికి ఇది గొప్ప అవకాశంగా మారుతుంది. ఇది జట్టు ‘బెంచ్ స్ట్రెంత్’ (Bench Strength) ను పరీక్షించడానికి కూడా ఉపయోగపడుతుంది. సెలెక్టర్లు త్వరలో అధికారికంగా జట్టును ప్రకటించనున్నారు. ఆ ప్రకటనలో బుమ్రా విశ్రాంతిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




