ఇంగ్లాండ్‌తో జులై 1-5 తేదీల్లో బర్మింగ్‌హామ్‌లో జరగనున్న టెస్ట్‌కు భారత సన్నాహాలకు దెబ్బ తగిలింది. కొంతమంది ఆటగాళ్లు కోవిడ్ బారిన పడ్డారు. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వైరస్ బారిన పడిన తర్వాత తన సహచరులతో కలిసి యునైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్లలేదు. మరోవైపు, ఓ ఆశ్చర్యకరమైన విషయం తెరపైకి వచ్చింది. వాస్తవానికి, గత వారం లండన్‌లో జట్టు దిగిన తర్వాత భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా కోవిడ్ -19 పాజిటివ్ ఉన్నట్లు తెలిసింది. ‘అవును, విరాట్ కూడా మాల్దీవులలో సెలవుల నుంచి తిరిగి వచ్చిన తర్వాత కోవిడ్‌కు గురయ్యాడు. కానీ, ఇప్పుడు అతను కోలుకున్నాడు’ అని ఓ వార్త సంస్థ తెలిపింది. కొంతమంది అభిమానులు సోమవారం లీసెస్టర్‌లో కోహ్లీతో దిగిన తమ సెల్ఫీలను పోస్ట్ చేశారు.
“జూన్ 24 నుండి లీసెస్టర్‌షైర్‌తో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో కోచ్ రాహుల్ ద్రవిడ్ కోరుకున్నట్లు జరగకపోవచ్చని తెలుస్తోంది. కోవిడ్ -19 తర్వాత ఆటగాళ్లను ఓవర్‌లోడ్ చేయకూడదని వైద్యులు సలహా ఇచ్చినందుకే ప్రాక్టీస్‌లో అంత ఉత్సాహం ఉండకపోవచ్చని” ఆ న్యూస్‌లో పేర్కొంది. అశ్విన్ గురించి బీసీసీఐ అధికారులు మాట్లాడుతూ, జులై 1 నుంచి టెస్టు మ్యాచ్ ప్రారంభమయ్యేలోపు అతడు కోలుకుంటాడనే ఆశాభావంతో ఉన్నాం. అయితే లీసెస్టర్‌షైర్‌తో జరిగే వార్మప్ మ్యాచ్‌లో ఆడడం అనుమానంగానే ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తర్వాత, అశ్విన్ టెస్ట్ మ్యాచ్‌లకు సన్నాహకంగా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) లీగ్ తరపున ఒక మ్యాచ్‌లో ఆడాడని పేర్కొన్నారు.
కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ కారణంగా గత ఏడాది ఆగిపోయిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో బర్మింగ్‌హామ్‌లో టీమ్ ఇండియా ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఎడ్జ్‌బాస్టన్ టెస్టు తర్వాత భారత్, ఇంగ్లండ్ మూడు వన్డేలు, టీ20లు ఆడనున్నాయి.