Team India: భారత జట్టుకు ఎదురు దెబ్బ.. ఈ ఏడాదిలోనే 8 మంది ప్లేయర్ల రిటైర్మెంట్.. లిస్ట్ ఇదిగో

|

Aug 25, 2024 | 3:58 PM

టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న ఈ డ్యాషింగ్ ప్లేయర్ అంతర్జాతీయ క్రికెట్ తో పాటు దేశవాళీ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఆదివారం (ఆగస్టు 25) తెలిపాడు. కాగా శిఖర్ ధావన్ తో 2024లో రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఆటగాళ్ల సంఖ్య 8కి చేరింది

Team India: భారత జట్టుకు ఎదురు దెబ్బ.. ఈ ఏడాదిలోనే 8 మంది ప్లేయర్ల రిటైర్మెంట్.. లిస్ట్ ఇదిగో
Team India Cricketers
Follow us on

టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న ఈ డ్యాషింగ్ ప్లేయర్ అంతర్జాతీయ క్రికెట్ తో పాటు దేశవాళీ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఆదివారం (ఆగస్టు 25) తెలిపాడు. కాగా శిఖర్ ధావన్ తో 2024లో రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఆటగాళ్ల సంఖ్య 8కి చేరింది. వీరిలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు మాత్రమే వీడ్కోలు పలికారు. మిగతా ఐదుగురు అన్ని రకాల క్రికెట్‌ ఫార్మాట్లకు గుడ్ బై చెప్పారు. వారెవరో తెలుసుకుందాం రండి.

సౌరభ్ తివారీ

భారత్ తరఫున 3 వన్డేలు ఆడిన ఎడమచేతి వాటం బ్యాటర్ సౌరభ్ తివారీ కూడా ఈ ఏడాది అన్ని రకాల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. తద్వారా తన 17 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పాడీ ప్లేయర్.

వరోన్ ఆరోన్

టీమిండియా పేసర్ వరోన్ ఆరోన్ కూడా అన్ని రకాల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆరోన్ భారత్ తరఫున 9 వన్డేలు, 9 టెస్టులు ఆడాడు.

ఇవి కూడా చదవండి

దినేష్ కార్తీక్

వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ దినేష్ కార్తీక్ కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2004లో భారత్ తరఫున అరంగేట్రం చేసి అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన డీకే మూడు ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్‌కు గుడ్‌బై కూడా చెప్పాడు.

కేదార్ జాదవ్

భారత్ తరఫున 73 వన్డే మ్యాచ్‌లు ఆడిన కేదార్ జాదవ్ అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలికాడు. దీంతో పదేళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు తెరపడింది.

శిఖర్ ధావన్

టీమిండియా లెఫ్టార్మ్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆగస్టు 24న రిటైర్మెంట్ ప్రకటించాడు. సోషల్ మీడియా ద్వారా మూడు రకాల క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు శిఖర్ ధావన్ తెలిపాడు.

విరాట్ కోహ్లీ

టీ20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత విరాట్ కోహ్లీ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే అతను టెస్టు, వన్డే క్రికెట్‌లో కొనసాగనున్నాడు.

రోహిత్ శర్మ

టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం వన్డే, టెస్టు జట్టులో కొనసాగుతున్న హిట్‌మన్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ తర్వాత అన్ని రకాల క్రికెట్‌లకు వీడ్కోలు పలికే అవకాశం ఉంది.

రవీంద్ర జడేజా

టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే జడేజా టెస్టు, వన్డే క్రికెట్‌లో కొనసాగుతున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..