Rinku Singh: ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు సూపర్‌ స్టార్స్.. రింకూతో ఉన్నఈ రియల్‌ హీరో ఎవరో తెలుసా? సినిమా కూడా వచ్చింది

|

Feb 09, 2024 | 6:18 PM

రింకూసింగ్‌.. క్రికెట్‌ ప్రపంచంలో నయా సెన్సేషన్‌.. ఐపీఎల్‌ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన ఈ ఆలీఘడ్‌ పూపర్‌ స్టార్‌ ఇప్పుడు టీమిండియాలోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. ఆఖరి ఓవర్లలో ధాటిగా బ్యాటింగ్‌ చేస్తూ భారత జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. అలా ఈ సూపర్‌ స్టార్ మరో రియల్ హీరోని కలిశాడు. ఇంతకీ ఆయనెవరో గుర్తుపట్టారా?

Rinku Singh: ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు సూపర్‌ స్టార్స్.. రింకూతో ఉన్నఈ రియల్‌ హీరో ఎవరో తెలుసా? సినిమా కూడా వచ్చింది
Rinku Singh
Follow us on

రింకూసింగ్‌.. క్రికెట్‌ ప్రపంచంలో నయా సెన్సేషన్‌.. ఐపీఎల్‌ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన ఈ ఆలీఘడ్‌ పూపర్‌ స్టార్‌ ఇప్పుడు టీమిండియాలోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. ఆఖరి ఓవర్లలో ధాటిగా బ్యాటింగ్‌ చేస్తూ భారత జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. అలా ఈ సూపర్‌ స్టార్ మరో రియల్ హీరోని కలిశాడు. ఇంతకీ ఆయనెవరో గుర్తుపట్టారా? కొంచెం కష్టమే కదా. అయితే సమాధానం మేమే చెబుతాం లెండి. ప్రస్తుతం ఎక్కడ చూసినా వినిపిచే సినిమా పేరు 12th ఫెయిల్‌. విధు వినోద్‌ చోప్రా తెరకెక్కించిన ఈ మూవీలో విక్రాంత్‌ మాస్సే హీరోగా నటించాడు. ఇంతకీ ఈ సినిమా కథేంటో తెలుసు కదా.. ప్రముఖ పీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగానే 12 th ఫెయిల్‌ సినిమాను రూపొందించారు. పై ఫొటోలో రింకూసింగ్‌ తో ఉన్నది ఆయనే. టీమ్ ఇండియా కొత్త ఫినిషర్ రింకూ సింగ్ ఇటీవల ఐపీఎస్‌ ఆఫీసర్ మనోజ్ కుమార్‌ను కలిశాడు. ఒకప్పుడు స్వీపర్‌ గా పనిచేశాడు రింకూ సింగ్‌. కష్టపడి క్రికెట్‌ లో ఓనమాలు నేర్చుకున్నాడు. ఐపీఎల్‌ లో కేకేఆర్ టీమ్‌ లో స్థానం సంపాదించాడు. ఆ తర్వాత టీమిండియాలో స్థానం సొంతం చేసుకున్నారు. అయితే ఎంత ఎదిగినా ఒదిగుండే స్వభావం రింకూది. తన డౌన్ టు ఎర్త్ స్వభావంతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఇక ఐపీఎస్ అధికారి మనోజ్ శర్మ కూడా ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడు. ఐపీఎస్ అధికారి మనోజ్ శర్మతో రింకూ సింగ్ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

విక్రాంత్ మాసే ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ట్వెల్ఫ్త్ ఫెయిల్’. రచయిత అనురాగ్ పాఠక్ ప్రసిద్ధ నవల ‘ట్వెల్ఫ్త్ ఫెయిల్’ ఆధారంగా IPS అధికారి మనోజ్ కుమార్ జీవిత కథ ను స్ఫూర్తిగా తీసుకుని విధు వినోద్ చోప్రా ఈ సినిమాను తెరకెక్కించారు. మొదట, మనోజ్ శర్మ పన్నెండవ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రాత్రి వేళల్లో రోడ్లపై పడుకున్నాడు. పొట్టకూటి కోసం ఆటోలు కూడా నడిపాడు. అయితేనేం తన లక్ష్యాన్ని మర్చిపోలేదు. ఐపీఎస్‌ పరీక్షల కోసం ప్రిపేరయ్యాడు. యూపీఎస్సీ పరీక్షల్లో చాలా సార్లు తప్పాడు. అయినా వెనకడుగువేయకుండా తన లక్ష్యాన్నిసాకారం చేసుకున్నాడు. ఈ ఐపీఎస్ ఆఫీసర్‌ కథ ఎవరికైనా స్ఫూర్తినిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇవి కూడా చదవండి

రింకూసింగ్ తో ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..