IND vs NZ: రోహిత్ ఖాతాలో చెత్త రికార్డ్.. బ్రియాన్ లారాతో జత కట్టిన టీమిండియా కెప్టెన్.. అదేంటంటే?
Rohit Sharma: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్ వర్సెస్ భారత్ మధ్య ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో భారత జట్టు ఛేజింగ్ చేయాల్సి వచ్చింది. అయితే, ఈ క్రమంలో టాస్ ఓడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన పేరిట ఓ చెత్త రికార్డ్ లిఖించుకున్నాడు.

దీంతో, రోహిత్ ఇప్పుడు వరుసగా 12 సార్లు టాస్‌లు ఓడిపోయాడు. అక్టోబర్ 1998 నుంచి మే 1999 మధ్య ఇలాంటి పరంపరను ఎదుర్కొన్న వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా పేరిట ఉన్న అవాంఛనీయ రికార్డును సమం చేశాడు. ఈ క్రమంలో భారత జట్టు వరుసగా 15వ టాస్ ఓడిపోయింది.
2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌తో మొదలైన ఈ టాస్ ఓటములు.. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వరకు కొనసాగింది.
వన్డేల్లో వరుసగా అత్యధిక టాస్‌లు కోల్పోయిన కెప్టెన్లు:
12 – బ్రియాన్ లారా (వెస్టిండీస్, అక్టోబర్ 1998 – మే 1999)
12 – రోహిత్ శర్మ (భారతదేశం, నవంబర్ 2023 – మార్చి 2025)
11 – పీటర్ బోరెన్ (నెదర్లాండ్స్, మార్చి 2011 – ఆగస్టు 2013)
అయితే, రోహిత్ టాస్ ఓడిపోయిన సందర్భంలోనూ మ్యాచ్ తీర్పు భారత జట్టుకు అనుకూలంగా రావడం గమనార్హం. ఈ మ్యాచ్‌కు ముందు కూడా అంతా రోహిత్ శర్మ టాస్ ఓడిపోయావాలనే కోరుకున్నారు. దీంతో ఫైనల్‌లోనూ అలాగే జరిగింది. మరి మ్యాచ్ ఫలితం ఎలా ఉండనుందో మరికొద్దిగంటల్లో తేలిపోనుంది.
ప్రస్తుత పరిస్థితి..
15 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ జట్టు 15 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ 9, టామ్ లాథమ్ 2 పరుగులతో నిలిచారు. విల్ యంగ్ 15, రచిన్ రవీంద్ర 37, కేన్ విలియమ్సన్ 11 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఇక భారత బౌలర్లలో కుల్దీప్ 2, వరుణ్ చక్రవర్తి 1 వికెట్ పడగొట్టారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..