Rishabh Pant: రెండో టెస్టు నుంచి రిషబ్ పంత్ ఔట్.. షాకింగ్ న్యూస్ చెప్పిన రోహిత్ శర్మ.. ఎందుకంటే?

Rohit Sharma Key Update on Rishabh Pant: తొలి టెస్ట్‌లో ఆకట్టుకున్న రిషబ్ పంత్.. రెండో టెస్ట్‌లో ఆడకపోవచ్చని సంకేతాలు వస్తున్నాయి. న్యూజిలాండ్‌ జట్టుతో ఓడిపోయిన భారత జట్టు.. రెండో టెస్ట్ కోసం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. రిషబ్ పంత్‌పై కీలక విషయాలు చెప్పుకొచ్చాడు.

Rishabh Pant: రెండో టెస్టు నుంచి రిషబ్ పంత్ ఔట్.. షాకింగ్ న్యూస్ చెప్పిన రోహిత్ శర్మ.. ఎందుకంటే?
Rohit SharmaImage Credit source: PTI
Follow us

|

Updated on: Oct 21, 2024 | 1:30 PM

Rohit Sharma Key Update on Rishabh Pant: బెంగళూరులో జరిగిన మొదటి టెస్టులో భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ మోకాలికి దెబ్బ తగిలింది. ఇదే కాలికి ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో అతని మోకాలికి తీవ్ర గాయమైంది. అతను బెంగళూరులో గాయపడినప్పుడు, విపరీతమైన నొప్పితో కనిపించాడు. మైదానం వదిలి వెళ్ళవలసి వచ్చింది. ఈ సంఘటన తర్వాత, అతను మ్యాచ్ మొత్తంలో మళ్లీ వికెట్ కీపింగ్ కోసం రాలేదు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన పంత్ 99 పరుగులు చేశాడు. పూణె టెస్టులో ఆడేందుకు సంబంధించి రోహిత్ శర్మ చేసిన ప్రకటన నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది.

పంత్‌కి మరిత విశ్రాంతి ఇవ్వాలి: రోహిత్ శర్మ

తొలి టెస్టు అనంతరం విలేకరుల సమావేశంలో రోహిత్ మాట్లాడుతూ.. “పంత్‌కు మోకాలికి ఆపరేషన్ జరిగింది. జాగ్రత్తగా ఉండటం మంచిది. అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పరిగెత్తడం సౌకర్యంగా ఉండదు. మేం చాలా జాగ్రత్తగా ఉండాలి. అతను గత కొన్నేళ్లుగా చాలా బాధపడ్డాడు, నొప్పితో జీవిస్తున్నాడు. కాబట్టి తదుపరి టెస్టుకు ముందు అతనికి అదనపు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం” అంటూ చెప్పుకొచ్చాడు.

రవీంద్ర జడేజా వేసిన బంతి నేరుగా వెళ్లి పంత్ మోకాలికి తాకింది. దేశం మొత్తం అతని కోసం ఆందోళన చెందింది. అయితే, మూడో రోజు టీ టైమ్‌లో ప్యాడ్‌లు వేసుకుని మైదానంలో ప్రాక్టీస్ చేయడానికి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మూడో రోజు పంత్ రాక అతను రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగుతున్నట్లు తెలిపాడు.

పంత్ ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్..

సాధారణంగా టెస్టు క్రికెట్‌లో దూకుడిగా ఆడే పంత్.. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో చాలా తెలివిగా బ్యాటింగ్ చేశాడు. మంచి బంతులకు పూర్తి గౌరవం ఇవ్వడంతో పాటు దూకుడు షాట్లపై కూడా చక్కటి నియంత్రణను కనబరిచాడు. పంత్ మంచి రిథమ్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు. తొంభైలకు చేరుకున్న తర్వాత, అతను 107 మీటర్ల పొడవైన సిక్స్ కొట్టడం ద్వారా తన ఉద్దేశాలను మరింత స్పష్టంగా చెప్పాడు.

అయితే, పంత్ ఒక పరుగు తేడాతో సెంచరీని కోల్పోవడంతో దురదృష్టకరం. స్కోరు 99 వద్ద, విలియం ఓ’రూర్క్ బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బాల్‌ను కట్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పంత్ ఔట్ అయ్యాడు. అతని ఏడో టెస్ట్ సెంచరీని స్కోర్ చేయలేకపోయాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రెండో టెస్టు నుంచి రిషబ్ పంత్ ఔట్.. షాకింగ్ న్యూస్ చెప్పిన రోహిత్
రెండో టెస్టు నుంచి రిషబ్ పంత్ ఔట్.. షాకింగ్ న్యూస్ చెప్పిన రోహిత్
దీపావళికి విమానంలో ఎగిరిపోతారా..?టిక్కెట్లపై పేటీఎం ప్రత్యేక ఆఫర్
దీపావళికి విమానంలో ఎగిరిపోతారా..?టిక్కెట్లపై పేటీఎం ప్రత్యేక ఆఫర్
చిలకడదుంపలు తింటే కలిగే మేలేంటో తెలిస్తే.. ఇక వదిలిపెట్టరు..!
చిలకడదుంపలు తింటే కలిగే మేలేంటో తెలిస్తే.. ఇక వదిలిపెట్టరు..!
పొరపాటున కూడా తేనెతో ఈ పదార్థాలు అస్సలు కలపండి.. యమ డేంజర్!
పొరపాటున కూడా తేనెతో ఈ పదార్థాలు అస్సలు కలపండి.. యమ డేంజర్!
ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి.? తీర ప్రాంతాలలో అసలు ఏం జరగొచ్చు.?
ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి.? తీర ప్రాంతాలలో అసలు ఏం జరగొచ్చు.?
కౌండిన్య అభయారణ్యంలో చిరుత మృతి.. కారణం అదేనా?
కౌండిన్య అభయారణ్యంలో చిరుత మృతి.. కారణం అదేనా?
మంచి కంటెంట్‌ సినిమాలపై పెద్ద బ్యానర్లు ఫోకస్..
మంచి కంటెంట్‌ సినిమాలపై పెద్ద బ్యానర్లు ఫోకస్..
గ్రూప్‌-1 అభ్యర్థుల పిటిషన్‌పై జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు
గ్రూప్‌-1 అభ్యర్థుల పిటిషన్‌పై జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు
అల్లు అర్జున్ పుష్ప 2 స్పెషల్ సాంగ్ కోసం ట్రెండింగ్ హీరోయిన్..
అల్లు అర్జున్ పుష్ప 2 స్పెషల్ సాంగ్ కోసం ట్రెండింగ్ హీరోయిన్..
బ్రషింగ్‌ విషయంలో మీక్కూడా ఈ అపోహలు ఉన్నాయా.?
బ్రషింగ్‌ విషయంలో మీక్కూడా ఈ అపోహలు ఉన్నాయా.?
ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి.? తీర ప్రాంతాలలో అసలు ఏం జరగొచ్చు.?
ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి.? తీర ప్రాంతాలలో అసలు ఏం జరగొచ్చు.?
3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..
3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..
48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!
48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!
బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ
బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ
కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..
కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..
ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..
ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..
వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?
వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?
25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?
25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?
త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!
త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. రెప్పపాటులో అంత ధ్వంసం.!
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. రెప్పపాటులో అంత ధ్వంసం.!