IND vs NZ 2nd Test: సుందర్ రాకతో ఆ ముగ్గురి కెరీర్‌కు ఇబ్బందులే.. టీమిండియా ప్లేయింగ్ 11 నుంచి ఔట్

IND vs NZ: బెంగళూరు టెస్ట్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో రోహిత్ శర్మసేనపై విజయం సాధించింది. ఈ ఓటమితో భారత అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే, టీమిండియాకు ఈ సిరీస్ గెలిచే అవకాశం ఇంకా ఉంది. ఎందుకంటే, ఈ సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. అయితే, రెండో మ్యాచ్‌లో బరిలోకి దిగే భారత జట్టులో కీలక మార్పు చేసుకుంది.

IND vs NZ 2nd Test: సుందర్ రాకతో ఆ ముగ్గురి కెరీర్‌కు ఇబ్బందులే.. టీమిండియా ప్లేయింగ్ 11 నుంచి ఔట్
Ind Vs Nz 2nd Test
Follow us

|

Updated on: Oct 21, 2024 | 11:56 AM

IND vs NZ: బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శన చేసి 8 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా చూపిన ఆటతీరు.. ఈ మ్యాచ్‌లో కనిపించలేదు. ఈ పరాజయంతో భారత అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే రోహిత్ శర్మ సేనకు ఈ సిరీస్ గెలిచే అవకాశం ఇంకా ఉంది. ఎందుకంటే, ఈ సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి.

కాగా, సిరీస్‌లో రెండో మ్యాచ్‌ ప్రారంభం కాకముందే టీమిండియా జట్టులో మార్పులు చోటు చేసుకున్నాయి. పవర్ ఫుల్ ఆల్-రౌండర్ వాషింగ్టన్ సుందర్ మిగిలిన రెండు మ్యాచ్‌ల కోసం జట్టులో చేరాడు. ఈ విషయం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు సుందర్ రాకతో టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 నుంచి ఏ ఆటగాడు తప్పుకుంటాడో చూడాలి. సుందర్ రాక కారణంగా ప్లేయింగ్ 11 నుంచి తప్పుకున్న ముగ్గురు ఆటగాళ్లను ఇక్కడ తెలుసుకుందాం..

3. కుల్దీప్ యాదవ్..

ఈ జాబితాలో టీమిండియా ప్రధాన స్పిన్నర్‌గా గుర్తింపు పొందిన కుల్దీప్ యాదవ్ కూడా ఉన్నాడు. అయితే, బెంగళూరు టెస్టులో అతని స్పిన్ మ్యాజిక్ కనిపించలేదు. కివీస్ బ్యాట్స్‌మెన్‌లు కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఈజీగా పరుగులు సాధించారు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 3 వికెట్లు తీయడంలో సఫలమయ్యాడు. ఇటువంటి పరిస్థితిలో, కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ 11 నుంచి తొలగించే అవకాశం ఉంది. అతని స్థానంలో సుందర్ తీసుకునే అవకాశం ఉంది.

2. రవీంద్ర జడేజా..

వెటరన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా బెంగళూరు టెస్టులో ఘోరంగా ఓడిపోయాడు. బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో తనదైన ముద్ర వేయడంలో విఫలమయ్యాడు. జడేజా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 5 పరుగులు మాత్రమే చేశాడు. అదే సమయంలో బౌలింగ్‌లో అతని ఖాతాలో 3 వికెట్లు వచ్చాయి. జడేజా నుంచి ఈ తరహా ప్రదర్శనను భారత అభిమానులు ఊహించలేదు. సుందర్ అతని స్థానంలో ఇండియా ప్లేయింగ్ 11లో ఆడే అవకాశం ఉంది.

1. కేఎల్ రాహుల్..

బెంగళూరు టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కేఎల్ రాహుల్ బ్యాట్ నిశబ్దంగా ఉంది. అతను తన బ్యాడ్ ఫామ్ నుంచి బయటకు రాలేకపోతున్నాడు. దాని కారణంగా జట్టు కూడా తీవ్ర పరిణామాలను చవిచూస్తోంది. ఇటువంటి పరిస్థితిలో, సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు 11 మందిలో రాహుల్ తన స్థానాన్ని దక్కించుకోవడం చాలా కష్టమని తెలుస్తోంది. సుందర్ ఇటీవలి ఫామ్ అద్భుతంగా ఉంది. రాహుల్‌ను భర్తీ చేయగలడని అంతా భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..
3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..
48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!
48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!
బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ
బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ
కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..
కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..
ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..
ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..
వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?
వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?
25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?
25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?
త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!
త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. రెప్పపాటులో అంత ధ్వంసం.!
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. రెప్పపాటులో అంత ధ్వంసం.!
జానీ మాస్టర్ విషయంలో శేఖర్,గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు: యానీ
జానీ మాస్టర్ విషయంలో శేఖర్,గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు: యానీ