Gautam Gambhir: నిజంగా నువ్వు గొప్పోడివి గంభీర్ భాయ్.. ఒక్క రూపాయికే తిన్నంత భోజనం

రూపాయికి చిన్న చాక్లెట్ కూడా రానిరోజుల్లో కడుపునిండా భోజనం పెడుతున్నాయి కొన్ని స్వచ్ఛంద సమస్థలు. గత మూడేళ్లుగా పేద ప్రజల కడుపు నింపుతున్నారు. అటు టీమిండియాకు సేవలందిస్తూనే .. ఇటు ఢిల్లీ ప్రజలకు ఆకలి తీరుస్తున్నాడు గంభీర్.

Gautam Gambhir: నిజంగా నువ్వు గొప్పోడివి గంభీర్ భాయ్.. ఒక్క రూపాయికే తిన్నంత భోజనం
Gambhir Canteen
Follow us

|

Updated on: Oct 21, 2024 | 9:42 AM

టీమిండియా హెడ్ కోచ్‌ గౌతమ్ గంభీర్ … పేద ప్రజల పట్ల దాతృత్వం చాటుకుంటున్నారు. ఢిల్లీ నగరంలో పేద ప్రజలెవరూ ఆకలితో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కమ్యూనిటీ కిచెన్‌లను ఏర్పాటు చేశారు. 2014లో ఢిల్లీలోని పటేల్‌ నగర్‌లో తన పేరుమీద ఓ ఫౌండేషన్‌ను ప్రారంభించారు గంభీర్. చదువు, మానవ హక్కులు, పోషకాహారం వంటి అంశాలపైన పనిచేసే ఈ ఫౌండేషన్‌ ద్వారా 2017 నుంచి ఏక్‌ ఆశా జన్‌ రసోయీ పేరుతో మరో కార్యక్రమానికీ శ్రీకారం చుట్టాడు. కమ్యూనిటీ కిచెన్‌ను ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఒక్క రూపాయికే భోజనాన్ని అందిస్తున్నారు. ఏక్ ఆశా జన్ రసోయీ ఫౌండేషన్‌లో పేదలకు అన్నం, కూర, చపాతీ లాంటి ఆహారాన్ని అందిస్తున్నారు. ఒక్క రూపాయికే పెట్టే ఈ క్యాంటీన్లో ప్రతిరోజూ దాదాపు వెయ్యిమంది వరకూ భోజనం చేస్తున్నారు. ఇక్కడకు వచ్చే ప్రజలు ఉచితంగా తింటున్నామనే ఫీలింగ్ లేకుండా ఉండేలా వాళ్ల నుంచి ఒక్క రూపాయి తీసుకుంటున్నారు.

ఏక్ ఆశా జన్ రసోయీ సేవలను గౌతమ్‌ గంభీర్‌ ఢిల్లీలో మరికొన్ని ప్రాంతంలోనూ ప్రారంభించనున్నారు. త్వరలో మరికొన్ని క్యాంటీన్లనూ ఏర్పాటు చేసే ఆలోచనలోనూ ఉన్నట్లు గంభీర్ స్వయంగా తెలిపారు. ఇదే తరహాలో కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఉండే చిన్న హోటల్‌ రోటీఘర్ కూడా రూపాయికి అన్నం, కూర, పప్పు లేదా సాంబారుతో కలిపిన భోజనాన్ని అందిస్తుంది. మహావీర్‌ యూత్‌ సంస్థాన్‌ అధ్వర్యంలో రోజువారి కూలీలకూ రూపాయి భోజనాన్ని రోటీఘర్‌ అందిస్తోంది. కోయంబత్తూరులోని ఆర్‌ఎస్‌ పురంలో కూడా పేదవాళ్లకు కడుపునిండా భోజనం కేవలం ఒక్క రూపాయికే అందిస్తోంది దేవేంద్రన్‌ నాడార్‌‌కు చెందిన కుటుంబం. కొన్నాళ్లక్రితం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..
ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..
వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?
వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?
25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?
25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?
త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!
త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. రెప్పపాటులో అంత ధ్వంసం.!
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. రెప్పపాటులో అంత ధ్వంసం.!
జానీ మాస్టర్ విషయంలో శేఖర్,గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు: యానీ
జానీ మాస్టర్ విషయంలో శేఖర్,గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు: యానీ
గ్యాంగ్ స్టర్ బెదిరింపులకు కోట్లు పెట్టి బుల్లెట్ ప్రూఫ్‌ కార్..
గ్యాంగ్ స్టర్ బెదిరింపులకు కోట్లు పెట్టి బుల్లెట్ ప్రూఫ్‌ కార్..
చిరు కాదన్న సినిమాతో.. కెరీర్ హిట్టు కొట్టిన రజినీ.! ఏంటా సినిమా?
చిరు కాదన్న సినిమాతో.. కెరీర్ హిట్టు కొట్టిన రజినీ.! ఏంటా సినిమా?
బ్యాడ్ టైం.! సంచలన సృష్టించే సినిమా ఆగిపోయింది కదా.!
బ్యాడ్ టైం.! సంచలన సృష్టించే సినిమా ఆగిపోయింది కదా.!
సల్మాన్ కేసులో వెబ్ సిరీస్‌గా గ్యాంగ్‌ స్టర్ బిష్ణోయ్‌ జీవిత కథ.
సల్మాన్ కేసులో వెబ్ సిరీస్‌గా గ్యాంగ్‌ స్టర్ బిష్ణోయ్‌ జీవిత కథ.