Jasprit Bumrah Viral Photo: పాకిస్థాన్‌లో జస్ప్రీత్ బుమ్రా? సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న ఫొటో..

|

Dec 13, 2022 | 11:36 AM

PAK vs ENG: ముల్తాన్‌లో పాకిస్థాన్‌ను మట్టికరిపించిన ఇంగ్లండ్ టీం డబ్ల్యూటీసీ నుంచి బాబర్ సేనను తప్పించింది. అయితే, రెండో టెస్టు మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడంటూ నెట్టింట్లో వైరల్ ఫొటో ఒకటి సందడి చేస్తోంది.

Jasprit Bumrah Viral Photo: పాకిస్థాన్‌లో జస్ప్రీత్ బుమ్రా? సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న ఫొటో..
Jasprit Bumrah
Follow us on

Jasprit Bumrah: భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం టీమిండియాకు దూరంగా ఉన్నాడు. గాయం కారణంగా అతను మైదానంలో ఆడడం లేదు. వికెట్లు తీయడం లేదు. అయినప్పటికీ, సోషల్ మీడియాలో ఏదో ఒక చోట కనిపిస్తూనే ఉన్నాడు. తాజాగా మరో వార్త నెట్టింట్లోకి వచ్చి వాలింది. దీంతో బుమ్రా గురించిన చర్చ హాట్ హాట్ గా సాగుతోంది. అందుకు కారణం ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షిస్తున్న పాకిస్థాన్‌లో కనిపించిన చిత్రమే. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఈ వైరల్ ఫొటోలో జస్ప్రీత్ బుమ్రా చిన్న రూపం కనిపించింది. అతని బాల్యం పాకిస్తాన్‌లో చూసినట్లు అనిపిస్తుంది.

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే బుమ్రా బాల్యం పాకిస్థాన్‌లో ఎప్పుడు కనిపించింది? ఎక్కడ? అని ప్రశ్నలు వస్తున్నాయి. ఐతే ఈ రెండు ప్రశ్నలకు సమాధానమే ఇటీవలే పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ చారిత్రాత్మక విజయానికి సాక్షిగా నిలిచిన ముల్తాన్‌లోని స్టేడియం. ముల్తాన్‌లో పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో జస్ప్రీత్ బుమ్రా ముఖంతో ఓ చిన్నారి కనిపించింది.

ఇవి కూడా చదవండి

పాకిస్థాన్‌లో బుమ్రా ‘చిన్న రూపం’..

పాకిస్థాన్‌లో కనిపిస్తున్న ఈ చిన్నారి ఫొటోను చూస్తుంటే బుమ్రా చిన్ననాటి ఫొటో చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఆ చిన్నారి పాకిస్థాన్ జట్టుకు మద్దతుగా స్టేడియానికి చేరుకుంది. అయితే ఈ ఫోటో వైరల్‌గా మారడంపై బుమ్రా నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు.

ముల్తాన్‌లోనూ ఓడిన పాకిస్థాన్‌..

ముల్తాన్ టెస్టులో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. దీంతో 3 టెస్టుల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ముల్తాన్‌లో ఓటమితో పాక్ జట్టుకు స్వదేశంలో వరుసగా మూడో టెస్టులో పరాజయం పాలైంది. ఇంగ్లండ్ చేతిలో పాక్ ఓడిపోయిన తర్వాత, దాని కెప్టెన్ బాబర్ ఆజం విమర్శలకు గురవుతున్నాడు. అందరూ బాబర్‌ను టార్గెట్ చేస్తున్నట్టున్నారు. అతని కెప్టెన్సీ కూడా ప్రశ్నార్థకంలో పడింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..