WTC Final 2023: భారత్, ఆస్ట్రేలియా ప్లేయర్ల చేతికి నల్ల బ్యాడ్జీలు.. కారణం ఏమిటో తెలిస్తే అభినందించకుండా ఉండలేరు..!

|

Jun 07, 2023 | 4:37 PM

WTC Final 2023: ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా తొలి బ్యాటింగ్ చేయనుంది. అయితే టాస్ ముగిసిన ఆరగంట తర్వాత ఇరు జట్లు కూడా మైదానంలోకి దిగగానే.. టీమిండియా ప్లేయర్లు చేతికి నల్ల బ్యాండ్‌లు కట్టుకుని..

WTC Final 2023: భారత్, ఆస్ట్రేలియా ప్లేయర్ల చేతికి నల్ల బ్యాడ్జీలు.. కారణం ఏమిటో తెలిస్తే అభినందించకుండా ఉండలేరు..!
IND and AUS Players with Black Armbands
Follow us on

WTC Final 2023: క్రికెట్ ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. లండన్‌లోని ఓవల్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్ బుధవారం ప్రారంభమైంది. ఇక ముందుగా టాస్ గెలిచిన రోహిత్ సేన బౌలింగ్ ఎంచుకోవడంతో.. కంగారుల జట్టు బ్యాటింగ్‌కి దిగింది. అయితే టాస్ ముగిసిన ఆరగంట తర్వాత ఇరు జట్లు కూడా మైదానంలోకి దిగగానే.. టీమిండియా ప్లేయర్లు చేతికి నల్ల బ్యాండ్‌లు కట్టుకుని కనిపించారు.

అయితే అలా నల్ల బ్యాండ్‌లతో భారత జట్టు ప్లేయర్లు మాత్రమేకాక  ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు కూడా బ్లాక్ బ్యాండ్స్ ధరించి మైదానంలోకి వచ్చారు. ఓడిశాలో జూన్ 2న రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో ఇప్పటిలెక్కల ప్రకారం దాదాపు 295 మంది ప్రయాణికులు మరణించారు. ఈ నేపథ్యంలో మరణించివారికి సంతాపం తెలుపుతూ.. ఇరు జట్ల ప్లేయర్లు మౌనం పాటించారు. ఈ సందర్భంగా బ్లాక్ బ్యాండ్ ధరించిన భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్ల కళ్లు కూడా తడిసిపోవడం గమనార్హం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌ తుది జట్లు

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్) శుభమాన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కెఎస్ భరత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

ఆస్ట్రేలియా: ప్యాట్ కమ్మిన్స్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..