Video: హాఫ్ సెంచరీతో ఇంగ్లండ్ బెండ్ తీసిన జడ్డూ.. వాళ్లకు బ్యాట్ చూపిస్తూ స్పెషల్ సెలబ్రేషన్స్..
Ravindra Jadeja Half Century: టీమిండియా గురించి చెప్పాలంటే, ప్రస్తుతం 94 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 80 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 74 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. జడేజా టీమ్ ఇండియా తరపున ఆరో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ సమయంలో, వార్తలు రాసే సమయానికి 109 బంతులు ఎదుర్కొని 62 పరుగులు చేశాడు.

Ravindra Jadeja IND vs ENG: హైదరాబాద్ టెస్టులో రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శనతో పాటు భారత్ తరపున తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. జడేజా అర్ధ సెంచరీతో టీమిండియా స్కోరు 300 దాటింది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరుగుతోంది. రాజీవ్ గాంధీ స్టేడియంలో ఇంగ్లండ్ బౌలర్ల పరిస్థితిని జడేజా చెడగొట్టాడు. జడేజా కంటే ముందు కేఎల్ రాహుల్ 86 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
జడేజా టీమ్ ఇండియా తరపున ఆరో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ సమయంలో, వార్తలు రాసే సమయానికి 109 బంతులు ఎదుర్కొని 62 పరుగులు చేశాడు. జడేజా ఈ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. హాఫ్ సెంచరీ తర్వాత జడేజా ఆసక్తికర రీతిలో సంబరాలు చేసుకున్నాడు. బ్యాట్‌తో కత్తిసాము చేస్తున్నట్లు సెలబ్రేషన్స్ చేశాడు. శ్రీకర్ భారత్‌తో జడేజా కీలక భాగస్వామ్యం ఆడాడు. జడేజా, కేఎల్ రాహుల్ మధ్య కూడా మంచి భాగస్వామ్యం నెలకొంది.
టీమిండియా గురించి చెప్పాలంటే, ప్రస్తుతం 94 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 80 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 74 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. 24 పరుగుల వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. 23 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ ఔట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ 123 బంతులు ఎదుర్కొని 86 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ 35 పరుగులు చేశాడు. భరత్ 41, అశ్విన్ 1 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఇంగ్లండ్ తరపున టామ్ హార్డ్లీ 2, జో రూట్ 2, లీచ్, రేహాన్ తలో వికెట్ పడగొట్టారు.
20th fifty in test for sir ravindra jadeja 🤍 sword celebration after a long time 😭#ravindrajadeja #indvwi pic.twitter.com/2QJmYvAj3U
— ANSH GABA (@WhatEverAnshh) January 26, 2024
హైదరాబాద్ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 246 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 70 పరుగులు చేశాడు.
20th half-century 👑@imjadeja #RAVINDRAJADEJA #INDvENG pic.twitter.com/I5rIkexnXx
— LA𝕏RAJSINH⁸ ⚔️ (@sirjadejastans8) January 26, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
