PAK A vs IND A Final : పాక్‌పై తేలిపోయిన భారత యువ బౌలర్లు.. ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియాకు భారీ టార్గెట్
ప్రతిష్ఠాత్మక ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్‌లో భారత యువ బౌలర్లు తేలిపోయారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. తాహిర్ (71 బంతుల్లో 108) శతకంతో చెలరేగగా, ఫర్హాన్ (65), సైమ్ అయుబ్ (59) అర్ధ శతకాలతో రాణించారు
ప్రతిష్ఠాత్మక ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్‌లో భారత యువ బౌలర్లు తేలిపోయారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. తాహిర్ (71 బంతుల్లో 108) శతకంతో చెలరేగగా, ఫర్హాన్ (65), సైమ్ అయుబ్ (59) అర్ధ శతకాలతో రాణించారు. టోర్నీ ఆరంభం నుంచి మెరుగైన ప్రదర్శన చేస్తోన్న టీమిండియా బౌలర్లు తీరా ఫైనల్‌లో చేతులెత్తేశారు. దీంతో ఓపెనర్లు అయూబ్, ఫర్హాన్ మొదటి వికెట్‌కు ఏకంగా 121 పరుగులు జోడించారు. సైమ్‌ను ఔట్ చేయడం ద్వారా సుథార్ ఎట్టకేలకు ఈ జోడీని విడదీశాడు. అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు నిలకడగా ఆడడంతో ఓ దశలో 183/2తో పాక్ పట్టిష్ఠ స్థితిలో నిలిచింది. అయితే రియాన్ పరాగ్ వరుస బంతుల్లో యూసుఫ్, ఖాసి అక్రమ్‌ను ఔట్ చేయడం, ఆ మరుసటి ఓవర్లోనే కెప్టెన్ మహ్మద్ హారీస్ ను సంధూ ఔట్ చేయడంతో టీమిండియా మళ్లీ పోటీలోకి వచ్చింది.
అయితే భారత్ ఆశలపై తయ్యబ్ తాహిర్ నీళ్లు చల్లాడు. ఫోర్లు, సిక్స్‌లు కొడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. ముబసిర్ ఖాన్‌తో కలిసి ఆరో వికెట్‌కు 126 పరుగులు జోడించి భారీ స్కోరుకు బాటలు వేశారు. టెయిలెండర్లు కూడా ధాటిగా ఆడడంతో ఓవర్లు పూర్తయ్యే సరికి 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీస్కోరు చేసింది. భారత బౌలర్లలో రియాన్ పరాగ్, హంగార్గేకర్ చెరో 2 వికెట్లు తీయగా, నిశాంత్ సింధు, మానవ్ సుతార్, హర్షిత్ రాణా ఒక్కో వికెట్ పడగొట్టారు.
A sensational century from Tayyab Tahir and fantastic fifties from both the openers have helped Pakistan ‘A’ post a huge total of 352 against India ‘A’ at the end of the first innings!#ACCMensEmergingTeamsAsiaCup #ACC pic.twitter.com/fU1Bux5YYF
— AsianCricketCouncil (@ACCMedia1) July 23, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..