మ్యాచ్ మధ్యలో స్టార్ క్రికెటర్‌కు హార్ట్ ఎటాక్! హుటాహుటినా ఆస్పత్రికి తరలింపు
ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌కు గుండెపోటు వచ్చింది. మొహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్, షైనెపుకుర్ క్రికెట్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. తీవ్రమైన నొప్పితో ఆసుపత్రికి తరలించబడిన తమీమ్‌కు వైద్యులు గుండెపోటును నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.

ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్‌లో భాగంగా సోమవారం సావర్‌లోని BKSP మైదానంలో మొహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్, షైనెపుకుర్ క్రికెట్ క్లబ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ కూడా పాల్గొన్నాడు. అయితే మ్యాచ్ మధ్యలో తమీమ్‌కు తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. 50 ఓవర్ల మ్యాచ్‌లో తమీమ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. మొదట్లో, అనుభవజ్ఞుడైన బ్యాటర్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి హెలికాప్టర్‌ను ఏర్పాటు చేశారు, కానీ అది సాధ్యపడలేదు.
వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఛాతీలో నొప్పిగా ఉందని తమీమ్ చెప్పగానే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి, ECG తీయించినట్లు BCB చీఫ్ ఫిజీషియన్ దేబాషిష్ చౌదరి ధృవీకరించారు. అయితే మ్యాచ్‌కి వచ్చే ముందే ఛాతీలో కాస్త నొప్పిగా అనిపించి తమీమ్ హాస్పిటల్‌కు వెళ్లాడు. ఆ తర్వాత మ్యాచ్‌కి వచ్చి ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో మరింత తీవ్రంగా నొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లాడు. పరీక్షించిన వైద్యులు అతనికి గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
🚨 Cricket Shocker!
Tamim Iqbal suffers a heart attack during a Dhaka Premier League match today. Wishing him a speedy recovery! 🙏#TamimIqbal #DPL pic.twitter.com/p6YHPu5Du8
— Cricketik 24×7 (@cricketik247) March 24, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..