ODI World Cup 2023: వరల్డ్ కప్‌ కోసం జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్.. మాజీ కెప్టెన్‌ లేకుండానే బరిలోకి..

ODI World Cup 2023: 15 మందితో కూడిన ఈ జట్టులో ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్ వంటి అనుభవజ్ఞ వికెట్ కీపర్-బ్యాటర్లతో పాటు మెహిదీ హాసన్ మిరాజ్, మెహదీ హాసన్, షోరిఫుల్ ఇస్లాం వంటి ఆటగాళ్లకు కూడా అవకాశం దక్కింది. అయితే వన్డే వరల్డ్ కప్ టోర్నీ బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టులో మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బల్ వంటి సీనియర్ ప్లేయర్‌కి అవకాశం దక్కలేదు. కెప్టెన్ షకిబ్ అల్ హాసన్‌తో తమీమ్‌కి ఉన్న విబేధాలే..

ODI World Cup 2023: వరల్డ్ కప్‌ కోసం జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్.. మాజీ కెప్టెన్‌ లేకుండానే బరిలోకి..
Bangladesh Team for ODI World Cup 2023

Updated on: Sep 26, 2023 | 10:24 PM

ODI World Cup 2023: వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం బంగ్లాదేశ్ తమ జట్టును ప్రకటించింది. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి జరిగే మెగా టోర్నీలో బంగ్లాదేశ్ టీమ్‌ను సీనియర్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హాసన్ నడిపించనుండగా.. నజ్ముల్ హుసేన్ షాంటో వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 15 మందితో కూడిన ఈ జట్టులో ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్ వంటి అనుభవజ్ఞ వికెట్ కీపర్-బ్యాటర్లతో పాటు మెహిదీ హాసన్ మిరాజ్, మెహదీ హాసన్, షోరిఫుల్ ఇస్లాం వంటి ఆటగాళ్లకు కూడా అవకాశం దక్కింది. అయితే వన్డే వరల్డ్ కప్ టోర్నీ బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టులో మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బల్ వంటి సీనియర్ ప్లేయర్‌కి అవకాశం దక్కలేదు. కెప్టెన్ షకిబ్ అల్ హాసన్‌తో తమీమ్‌కి ఉన్న విబేధాలే ఇందుకు కారణమని తెలుస్తోంది.

వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్‌ జట్టు: షకీబ్‌ అల్‌ హాసన్‌ (కెప్టెన్‌), ముష్ఫికర్‌ రహీమ్, లిటన్‌ దాస్‌, నజ్ముల్‌ హొసేన్‌ షాంటో, మెహిదీ హసన్‌ మీరజ్‌, తౌహిద్‌ హ్రిదోయ్‌,తస్కిన్‌ అహ్మద్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, షొరీఫుల్‌ ఇస్లాం, హాసన్‌ మహ్మూద్‌, నసుమ్‌ అహ్మద్‌, మెహిదీ హాసన్‌, తంజిమ్‌ షకీబ్‌, తంజిద్‌ తమీమ్‌, మహ్మదుల్లా రియాద్‌

వరల్డ్ కప్ బంగ్లాదేశ్ షెడ్యూల్:

అక్టోబర్ 5 నుంచి జరిగే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు జరిగే వార్మప్ మ్యాచ్‌ల్లో శ్రీలంక, ఇంగ్లాండ్‌తో బంగ్లాదేశ్ జట్టు తలపడుతుంది. ఆ తర్వాత అంటే అక్టోబర్ 7న ఆఫ్గాన్‌తో జరిగే మ్యాచ్ ద్వారా బంగ్లా జట్టు తన వరల్డ్ కప్ కాంపెయిన్‌ని ప్రారంభిస్తుంది.

  1. అక్టోబర్ 7: బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్
  2. అక్టోబర్ 10: బంగ్లాదేశ్ vs ఇంగ్లాండ్
  3. అక్టోబర్ 14: బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్
  4. అక్టోబర్ 19: బంగ్లాదేశ్ vs భారత్
  5. అక్టోబర్ 24: బంగ్లాదేశ్ vs దక్షిణాఫ్రికా
  6. అక్టోబర్ 28: బంగ్లాదేశ్ vs నెదర్లాండ్స్
  7. నవంబర్ 31: బంగ్లాదేశ్ vs పాకిస్తాన్
  8. నవంబర్ 6: బంగ్లాదేశ్ vs శ్రీలంక
  9. నవంబర్ 9: బంగ్లాదేశ్ vs ఆస్ట్రేలియా

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..