- Telugu News Photo Gallery Cricket photos CWC 2023: Top 5 Bowlers to Pick most wickets in ODI World Cup History
ODI World Cup 2023: వరల్డ్ కప్ చరిత్రలో తోపు బౌలర్లు వీరే.. టాప్ 5 లిస్టులో భారత ప్లేయర్లకు దక్కని చోటు..
ODI World Cup 2023: భారత్ వేదికగా ఆక్టోబర్ 5 నుంచి 13వ ఎడిషన్ ‘వన్డే వరల్డ్ కప్’ 2023 ప్రారంభం కానుంది. ఇక వరల్డ్ కప్ అంటే అటు బౌలర్లు, ఇటు బ్యాటర్లు రెచ్చిపోయి ఆడాలని ప్లాన్ చేసుకుంటారు. అయితే వారిలో కొందరు మాత్రమే రాణించగలరు. ఈ క్రమంలో ఇప్పటివరకు జరిగిన 12 ఎడిషన్ల వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 ఆటగాళ్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Sep 26, 2023 | 10:19 PM

1. గ్లెన్ మెక్‌గ్రాత్: వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడ్ గ్లెన్ మెక్‌గ్రాత్ అగ్రస్థానంలో ఉన్నాడు. తన కెరీర్‌లో 39 వరల్డ్ కప్ ఇన్నింగ్స్ ఆడిన మెక్‌గ్రాత్ మొత్తం 71 వికెట్లు పడగొట్టాడు.

2. ముత్తయ్య మురళీధరణ్: రెండో స్థానంలో శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరణ్ ఉన్నాడు. మురళీ 39 వన్డే వరల్డ్ కప్ ఇన్నింగ్స్‌ల్లో 68 వికెట్లు పడగొట్టాడు.

3. లసిత్ మలింగ: లసిత్ మలింగ కూడా ఈ లిస్టులో ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో 28 ఇన్నింగ్స్ ఆడిన మలింగ 56 వికెట్లు పడగొట్టి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

4. వసీమ్ అక్రమ్: వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల లిస్టులో పాక్ మాజీ వసీమ్ అక్రమ్ 4వ స్థానంలో ఉన్నాడు. అక్రమ్ 36 వన్డే వరల్డ్ కప్ ఇన్నింగ్స్ ఆడిన అక్రమ్ తన కెరీర్‌లో 55 వికెట్లు పడగొట్టాడు.

5. మిచెల్ స్టార్క్: ఇక టాప్ 5 లిస్టులో ఉన్న ఏకైక యాక్టీవ్ ప్లేయర్ మిచెల్ స్టార్క్. వన్డే వరల్డ్ కప్‌లో ఆసీస్ తరఫున 18 ఇన్నింగ్స్ ఆడిన స్టార్క్ ఏకంగా 49 వికెట్లు పడగొట్టి 5వ స్థానంలో ఉన్నాడు.

కాగా, వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల లిస్టులో భారత్ నుంచి జహీర్ ఖాన్ (23 ఇన్నింగ్స్‌ల్లో 44), జవగళ్ శ్రీనాథ్ (33 ఇన్నింగ్స్‌ల్లో 44) వరుసగా 7, 8 స్థానాల్లో ఉన్నారు.




