2021 టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీసేన 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 20 ఓవర్లకు 151 పరుగులు చేసింది. ఇక టీమిండియా విధించిన ఆ స్వల్ప లక్ష్యాన్ని పాకిస్తాన్ 13 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో చేధించింది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్(68*), రిజ్వాన్(79*) పరుగులతో మొదటి వికెట్‌కు రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీనితో ప్రపంచకప్‌లో పాకిస్తాన్ తొలిసారిగా భారత్‌ను ఓడించింది. ఈ విజయంలో పాకిస్తాన్ ఆటగాళ్లు మాత్రమే కాదు.. కోచింగ్ సిబ్బంది కూడా కీలక పాత్ర పోషించారని చెప్పాచ్చు. అటు టీమిండియాను కొంపముంచిన కారణాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ‘ఆ నలుగురు’ ఆటగాళ్లపై భారీ అంచనాలు ఉండగా.. వారు దాన్ని అందుకోలేకపోయారు.
పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లోనూ తేలిపోయింది. ముఖ్యంగా టాప్ ఆర్డర్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో.. భారం మొత్తం కోహ్లీపై పడింది. అలాగే మిడిల్ ఆర్డర్‌లో సూర్యకుమార్ యాదవ్ విఫలం కావడం కూడా టీమిండియాకు మైనస్‌గా మారింది. అటు బౌలర్లు కూడా తేలిపోవడంతో భారత్ పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. మిస్టరీ స్పిన్నర్‌గా బరిలోకి దిగిన వరుణ్ చక్రవర్తి కూడా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. ప్రపంచకప్‌లలో టీమిండియాపై పాకిస్తాన్‌కు ఇదే తొలి విజయం.
ఇక భారత్ ఘోర పరాభవం తర్వాత నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు. ఫామ్‌లో లేని భువనేశ్వర్ బదులు శార్దూల్‌ను తుది జట్టులోకి ఎందుకు ప్లేస్ ఇవ్వలేదని.? అశ్విన్‌ను ఎందుకు తప్పించారని.? ధోని వ్యూహం తప్పిందా.? లేక ఇవి కోహ్లీ స్వంత నిర్ణయాలా.? మెంటార్‌గా ధోని సలహాలు ఎంతవరకు తీసుకున్నారు.? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
మరోవైపు పాకిస్తాన్ గెలుపులో.. ఆ జట్టు ఆటగాళ్లతో పాటు కోచింగ్ స్టాఫ్ భాగస్వామ్యం కూడా కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. టీ20 ప్రపంచకప్ ముందు పాకిస్తాన్ మొత్తం కోచింగ్ స్టాఫ్ మార్చింది. హెడ్ కోచ్‌గా సక్లైన్ ముస్తాక్, బ్యాటింగ్ కోచ్‌గా మాథ్యూ హేడెన్, బౌలింగ్ కోచ్‌గా వెర్నాన్ ఫిలాండర్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అలాగే అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా మారిన తర్వాత బాబర్ ఆజామ్.. తన ఆటతీరును పూర్తిగా మార్చుకున్నాడు. కూల్ కెప్టెన్సీతో పాక్‌కు విజయాలు అందించడమే కాకుండా.. కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. అటు షాహీన్ అఫ్రిదిని బాబర్ ఆజామ్ ప్రత్యర్ధులపై ఓ అస్త్రంలా ఉపయోగిస్తున్నాడు. అతడు కూడా సరైన సమయాల్లో వికెట్లు తీస్తూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే ఓపెనర్ రిజ్వాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మిడిల్ ఆర్డర్‌కు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా.. ప్రతీ మ్యాచ్‌లోనూ కావల్సినంత స్కోర్‌ను అందిస్తూ.. రన్‌రేట్‌ను పరుగులు పెట్టిస్తున్నాడు. మొత్తానికి టీమిండియాను ‘ఆ నలుగురు’ కొంపముంచితే.. పాకిస్తాన్‌కు ఆ నలుగురు విజయాన్ని అందించారు.
ఈ మ్యాచ్‌తో పాకిస్తాన్ గత రికార్డులను తిరగరాసింది. ఇప్పటిదాకా ప్రపంచకప్‌లలో పాకిస్తాన్‌పై టీమిండియాదే పైచేయి. కాని మొట్టమొదటి సారిగా బెస్ట్ బ్యాట్స్‌మెన్లు, బౌలర్లు నిండిన టీమిండియాపై అన్ని విభాగాల్లో పాకిస్తాన్ నిలవరించడమే కాకుండా.. అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.
Read Also: ఆ ఒక్క కారణమే.. సమంతకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది..!! అందుకే అలా చేసింది.
డాగ్జిల్లా Vs కాంగ్.. కర్ర తీసుకుని కుక్కను కొట్టిన కోతి.. క్రేజీ వీడియో నెట్టింట వైరల్!
రోజూ భార్యతో గొడవలు.. చివరికి భర్త ఏం పని చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
వార్నర్, విలియమ్సన్, నబీ మెగా ఆక్షన్‌లోకి.! వచ్చే ఏడాది మారనున్న సన్‌రైజర్స్ జట్టు..