IND vs BAN: భారత్ వర్సెస్ బంగ్లా మ్యాచ్‌ను మిస్ అయ్యారా? హైలెట్స్ మీకోసమే.. చూసేయండి

|

Jun 23, 2024 | 7:22 AM

 IND vs BAN,T20 World Cup 2024: ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా శనివారం (జూన్ 22) బంగ్లాదేశ్ తో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏకంగా 50 పరుగుల తేడాతో గెలుపొంది సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. సూపర్ 8 రౌండ్‌లో భారత్ ఇప్పటి వరకు 2 మ్యాచ్‌లు ఆడగా రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది.

IND vs BAN: భారత్ వర్సెస్ బంగ్లా మ్యాచ్‌ను మిస్ అయ్యారా? హైలెట్స్ మీకోసమే.. చూసేయండి
India Vs Bangladesh
Follow us on

IND vs BAN,T20 World Cup 2024: ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా శనివారం (జూన్ 22) బంగ్లాదేశ్ తో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏకంగా 50 పరుగుల తేడాతో గెలుపొంది సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. సూపర్ 8 రౌండ్‌లో భారత్ ఇప్పటి వరకు 2 మ్యాచ్‌లు ఆడగా రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. అంతే కాకుండా ఈ రెండు మ్యాచ్‌లు అత్యుత్తమ నెట్ రన్ రేట్‌తో గెలు పొందింది. కాబట్టి భారత్ సెమీస్ చేరడం ఖాయం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ కేవలం 146 పరుగులకే పరిమితమైంది. దీంతో బంగ్లాదేశ్ జట్టు సెమీఫైనల్ కల చెదిరిపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. మొదట కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ శుభారంభం అందించారు. ఈ ఆరంభాన్ని సద్వినియోగం చేసుకున్న బ్యాటర్లందరూ ధాటిగా ఆడారు. దీంతో బంగ్లా ఎదుట భారత్ భారీ లక్ష్యాన్ని ఉంచింది.

ఇన్నింగ్స్ చివరి బంతికి బౌండరీ బాదిన టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరగా, హార్దిక్ 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయంగా 50 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 23 పరుగులు, విరాట్ కోహ్లీ 37, రిషబ్ పంత్ 36, సూర్యకుమార్ యాదవ్ 6, శివమ్ దూబే 34 పరుగులు చేశారు. బంగ్లాదేశ్‌ తరఫున రిషద్‌ హొస్సేన్‌, తంజిమ్‌ హసన్‌ సాకిబ్‌ చెరో 2 వికెట్లు తీయగా, షకీబ్‌ అల్‌ హసన్‌ 1 వికెట్‌ తీశారు.

ఇవి కూడా చదవండి

భారత్ వర్సెస్ బంగ్లామ్యాచ్ హైలెట్స్..

197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు 146 పరుగులకే ఆలౌటైంది. శాంటో జట్టులో నజ్ముల్ హుస్సేన్ అత్యధికంఆ 40 పరుగులు చేయగా, రిషాద్ హొస్సేన్ 24 పరుగులు చేశాడు. మరోవైపు, టీమిండియా తరఫున కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగా, అర్ష్దీప్ సింగ్-జస్ప్రీత్ బుమ్రా చెరో 2 వికెట్లు తీయగలిగారు. హార్దిక్ పాండ్యా కూడా 1 వికెట్ సాధించాడు.

 

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): తాంజిద్ హసన్, లిట్టన్ దాస్(కీపర్), నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, జాకర్ అలీ, రిషాద్ హుస్సేన్, మహేదీ హసన్, తంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ రహ్మాన్.

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..