T20 World Cup 2024 Super 8: టీమిండియా సూపర్ 8 షెడ్యూల్ ఇదే.. ఆ 3 జట్లలో డేంజరస్ ఏదంటే?

India T20 World Cup Super 8 Schedule: రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటికే టీ20 ప్రపంచ కప్ 2024 సూపర్ 8కి చేరుకుంది. సూపర్ 8లో ఎవరితో ఢీ కొట్టనుందనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ప్రపంచకప్ గ్రూప్ మ్యాచ్‌లు జూన్ 18 వరకు జరుగుతాయి. ఆ తర్వాత జూన్ 19 నుంచి 25 మధ్య సూపర్ 8 మ్యాచ్‌లు జరగనున్నాయి.

T20 World Cup 2024 Super 8: టీమిండియా సూపర్ 8 షెడ్యూల్ ఇదే.. ఆ 3 జట్లలో డేంజరస్ ఏదంటే?
India T20 World Cup Super 8 Schedule
Follow us

|

Updated on: Jun 14, 2024 | 2:27 PM

India T20 World Cup Super 8 Schedule: రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటికే టీ20 ప్రపంచ కప్ 2024 సూపర్ 8కి చేరుకుంది. సూపర్ 8లో ఎవరితో ఢీ కొట్టనుందనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ప్రపంచకప్ గ్రూప్ మ్యాచ్‌లు జూన్ 18 వరకు జరుగుతాయి. ఆ తర్వాత జూన్ 19 నుంచి 25 మధ్య సూపర్ 8 మ్యాచ్‌లు జరగనున్నాయి. జూన్ 27న ప్రపంచకప్ సెమీఫైనల్, జూన్ 29న టైటిల్ మ్యాచ్ జరగనుంది. ఐదు జట్లు, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇండియా, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ సూపర్ 8కి చేరుకున్నాయి. మిగిలిన మూడు స్థానాల కోసం గ్రూప్ దశలో పోరు కొనసాగుతోంది. ఆఫ్ఘనిస్తాన్ విజయంతో ప్రపంచ కప్ నుంచి న్యూజిలాండ్‌ తప్పుకుంది. ఈ విజయంతో భారత జట్టు సూపర్ 8 మూడు మ్యాచ్‌లు ధృవీకరించబడ్డాయి. ఏ జట్లతో ఎప్పుడు ఢీ కొట్టనుందో వివరంగా తెలుసుకుందాం..

టోర్నీలో పాల్గొనే మొత్తం 20 జట్లను ఐదు చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 8 దశకు అర్హత సాధిస్తాయి. అక్కడ ఆ జట్లను రెండు గ్రూపులుగా విభజించనున్నారు. సూపర్ 8లో జట్ల సీడ్‌లను ఐసీసీ ఇప్పటికే నిర్ణయించింది. అయితే, ఈ 8 సీడ్ జట్లలో ఏ జట్టు అయినా సూపర్ 8కి చేరుకోలేకపోతే, అర్హత సాధించిన అన్‌సీడెడ్ జట్టు దాని స్థానంలో ఉంటుంది.

టీమిండియా సూపర్ 8 మ్యాచ్‌లు..

గ్రూప్ 1లో న్యూజిలాండ్ జట్టు సూపర్ 8కి అర్హత సాధించలేకపోయింది. ఇటువంటి పరిస్థితిలో, ఆ గ్రూప్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ అన్ సీడెడ్ జట్టు C1 గా సూపర్ 8 లో ఆడుతుంది. అదే సమయంలో, శ్రీలంక జట్టు కూడా సూపర్ 8 రేసులో లేదు. గ్రూప్ D నుంచి బంగ్లాదేశ్ జట్టు ఉంటుందని తెలుస్తోంది. భారత్‌కు రెండు సూపర్ 8 మ్యాచ్‌లు ఖాయమయ్యాయి. మరో జట్టుతో మ్యాచ్ నిర్థారణ కాలేదు. కానీ, వస్తోన్న సమాచారం ప్రకారం బంగ్లాదేశ్ జట్టుతో రెండో మ్యాచ్ ఆడనుంది. అవేంటో ఓసారి చూద్దాం..

బార్బడోస్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే పోరుతో టీమిండియా తన సూపర్ 8 క్యాంపెయిన్‌ను ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ జూన్ 20న జరగనుంది. ఇక టీమిండియా తన రెండో మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ జూన్ 22న ఆంటిగ్వాలో ఆగనుంది. ఇక సూపర్ 8లో భాగంగ చివరి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈ మ్యాచ్ జూన్ 24న నిర్వహించనున్నారు. దీంతో టీమిండియా సూపర్ 8 మ్యాచ్‌లు పూర్తి కానున్నాయి.

ఇండియా సూపర్ 8 షెడ్యూల్..

తేదీ

జట్టు

వేదిక

20 జూన్ ఆఫ్ఘనిస్తాన్ (C1) బార్బడోస్
22 జూన్ బంగ్లాదేశ్ (D2) (ఇంకా నిర్థారణ కాలేదు) యాంటీగా
24 జూన్ ఆస్ట్రేలియా (B2) సెయింట్ లూసియా

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనంత్ అంబానీ పెళ్లిలో మహేశ్ కూతురు సితార.. సినీ స్టార్లతో ఫొటోలు
అనంత్ అంబానీ పెళ్లిలో మహేశ్ కూతురు సితార.. సినీ స్టార్లతో ఫొటోలు
మానవాళిని భయపెడుతోన్న మరో వైరస్.. ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్
మానవాళిని భయపెడుతోన్న మరో వైరస్.. ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్
ఓటీటీలోకి మలయాళం కామెడీ థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలోకి మలయాళం కామెడీ థ్రిల్లర్ మూవీ..
వరుస అల్పపీడనాలు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో భారీ వర్షాలు..
వరుస అల్పపీడనాలు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో భారీ వర్షాలు..
టీవీని ఎంత డెస్టెన్స్‌లో చూడాలో తెలుసా?
టీవీని ఎంత డెస్టెన్స్‌లో చూడాలో తెలుసా?
టాలీవుడ్ విలన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అంజలా జవేరి..
టాలీవుడ్ విలన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అంజలా జవేరి..
మీకూ అర్ధరాత్రిళ్లు హఠాత్తుగా కడుపు నొప్పి వస్తుందా?
మీకూ అర్ధరాత్రిళ్లు హఠాత్తుగా కడుపు నొప్పి వస్తుందా?
ట్రంప్‌ దాడి వెనుక రహస్యం ఏంటి? దుండగుడు దాగున్న ఆ బిల్డింగ్‌లోనే
ట్రంప్‌ దాడి వెనుక రహస్యం ఏంటి? దుండగుడు దాగున్న ఆ బిల్డింగ్‌లోనే
వివాదంలో హీరో రక్షిత్ శెట్టి.. పోలీస్ కేసు నమోదు.. అసలు ఏమైందంటే?
వివాదంలో హీరో రక్షిత్ శెట్టి.. పోలీస్ కేసు నమోదు.. అసలు ఏమైందంటే?
చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా..
చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా..
చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా..
చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా..
ఏరా.! మీరు మారరా.? ఇతడు ఏం చేశాడో తెలిస్తే
ఏరా.! మీరు మారరా.? ఇతడు ఏం చేశాడో తెలిస్తే
ఇంకా స్పేస్‌లోనే సునీతా విలియమ్స్ తిరిగొచ్చేదెప్పుడు.?
ఇంకా స్పేస్‌లోనే సునీతా విలియమ్స్ తిరిగొచ్చేదెప్పుడు.?
దారుణం.. మిస్టర్ తెలంగాణ సోహైల్ మృతి. బైక్‌పై వెళ్తూ..
దారుణం.. మిస్టర్ తెలంగాణ సోహైల్ మృతి. బైక్‌పై వెళ్తూ..
EPFO కీలక అప్‌డేట్‌.. ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ చేసుకున్న వారికి ఆఫర్.
EPFO కీలక అప్‌డేట్‌.. ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ చేసుకున్న వారికి ఆఫర్.
3.5 ఎకరాల్లో ఒక్కటే మర్రి చెట్టు.. శతాబ్దాల చెట్టుకు పునరుజ్జీవం.
3.5 ఎకరాల్లో ఒక్కటే మర్రి చెట్టు.. శతాబ్దాల చెట్టుకు పునరుజ్జీవం.
అండమాన్‌లో తెలుగు వారిపై లాఠీ చార్జ్.. పలువురికి గాయాలు.
అండమాన్‌లో తెలుగు వారిపై లాఠీ చార్జ్.. పలువురికి గాయాలు.
ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌గా ఇవి తీసుకుంటే అలసట దూరం., మీ గుండె పదిలం.!
ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌గా ఇవి తీసుకుంటే అలసట దూరం., మీ గుండె పదిలం.!
భాగ్యనగరంలో భారీ వర్షం.. వరదలో కారు ఎలా కొట్టుకుపోతుందో చూడండి
భాగ్యనగరంలో భారీ వర్షం.. వరదలో కారు ఎలా కొట్టుకుపోతుందో చూడండి
ప్రేమ పేరుతో వేధింపులు యువతి ఆత్మహత్య.! ఫొటోస్ పెడతానంటూ..
ప్రేమ పేరుతో వేధింపులు యువతి ఆత్మహత్య.! ఫొటోస్ పెడతానంటూ..