
కోరీ అండర్సన్.. ప్రస్తుతం అమెరికా వేదికగా జరుగుతోన్న టీ 20 ప్రపంచకప్‌లో బాగా వినిపిస్తోన్న పేరు. ఈ మెగా క్రికెట్ టోర్నీలో యూఎస్ఏకు ప్రాతినిథ్యం వహిస్తోన్న అండర్సన్ ఆల్ రౌండర్ గా రాణిస్తున్నాడు. అబు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. ఈ టీ20 ప్రపంచకప్ లో అమెరికా సూపర్-8 కు చేరడంలో అండర్సన్ కూడా కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ స్టార్ క్రికెటర్ ఒకప్పుడు న్యూజిలాండ్ తరఫున ఆడాడు. అయితే భార్య కోసం దేశం మారాడు. అమెరికాకు వలస వచ్చాడు. దీంతో చాలామంది అండర్సను నానా మాటలు అన్నారు. ఎగతాళి చేశారు. అయితే అవమానాలు, కష్టాలను అధిగమించి నేడు హీరోగా అవతరించాడు అండర్సన్.
కోరీ అండర్సన్.. న్యూజిలాండ్ తరఫున 13 టెస్టులు, 49 వన్డేలు, 31 టీ20లు ఆడాడు. కానీ ఎక్కువ కాలం జట్టులో కొనసాగలేకపోయాడు. ఫామ్ లో ఉండగానే అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. 2018లో కివీస్ తరఫున చివరి మ్యాచ్ ఆడాడు అండర్సన్. దీనికి ప్రధాన కారణం అతని భార్య మేరీ షాంబార్గర్. ఆమె కోసమే ఏకంగా దేశం మారాడీ స్టార్ ఆల్ రౌండర్. వీరిద్దరు కొన్ని సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్నారు. 2018 గ్రీక్ లోని ఐస్ లాండ్స్ ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. 2021లో టెక్సాస్ వీరు వివాహం చేసుకున్నారు.
న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని రోజులకే అమెరికా జట్టులో చేరాడు అండర్సన్. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఆ సమయంలో అండర్సన్ ను చాలా మంది ఎగతాళి చేశారు. భార్య కోసం దేశం మారతావా? న్యూజిలాండ్ లాంటి పెద్ద దేశాన్ని వదిలి.. పసికూన అమెరికా తరఫున ఆడతావా? అంటూ విమర్శించారు. కానీ ఇప్పుడు ఆ అండర్సనే హీరోగా అవతరించాడు. తన అమెరికా జట్టును సూపర్- 8 చేర్చాడు. అదే సమయంలో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు సూపర్-8 కు చేరుకోకుండానే నిష్ర్కమించడం కొస మెరుపు.
Corey Anderson – the only New Zealander who will play in Super 8s of T20 WC 2024! #T20WorldCup #NewZealand pic.twitter.com/EpwK5rCOlP
— Filtercricket (@filter_cricket) June 15, 2024
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..