SL vs SA: ఢిల్లీని ముంచాడు.. దేశం తరపున దుమ్మురేపాడు.. 4 ఓవర్లలో 4 వికెట్లతో రఫ్ఫాడించిన బౌలర్

|

Jun 04, 2024 | 6:27 AM

Anrich Nortje Outstanding Bowling: టీ20 ప్రపంచకప్ తొమ్మిదో ఎడిషన్‌లో నాలుగో మ్యాచ్‌లో శ్రీలంక దక్షిణాఫ్రికాతో తలపడింది. అయితే, ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ వనిందు హసరంగ టాస్ గెలిచి క్లిష్ట పిచ్‌పై బ్యాటింగ్‌కు దిగడంతో శ్రీలంక 77 పరుగులకు ఆలౌటైంది.

SL vs SA: ఢిల్లీని ముంచాడు.. దేశం తరపున దుమ్మురేపాడు.. 4 ఓవర్లలో 4 వికెట్లతో రఫ్ఫాడించిన బౌలర్
Anrich Nortje
Follow us on

Anrich Nortje Outstanding Bowling: టీ20 ప్రపంచకప్ తొమ్మిదో ఎడిషన్‌లో నాలుగో మ్యాచ్‌లో శ్రీలంక దక్షిణాఫ్రికాతో తలపడింది. అయితే, ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ వనిందు హసరంగ టాస్ గెలిచి క్లిష్ట పిచ్‌పై బ్యాటింగ్‌కు దిగడంతో శ్రీలంక 77 పరుగులకు ఆలౌటైంది. 78 పరుగుల లక్ష్యాన్ని బౌన్సీ వికెట్‌పై ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా కూడా 4 వికెట్లు కోల్పోయింది. ఈ లక్ష్యాన్ని 17వ ఓవర్‌లో ఛేదించింది.

ఈ మ్యాచ్‌లో, శ్రీలంక టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయం పూర్తిగా తప్పుగా నిరూపితమైంది. దక్షిణాఫ్రికా బౌలర్ల ముందు శ్రీలంక బ్యాట్స్‌మెన్ పరుగులు చేయాలేకపోయారు. ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నార్ట్జే శ్రీలంక బ్యాట్స్‌మెన్‌పై విధ్వంసం సృష్టించాడు. తన 4 ఓవర్ స్పెల్‌లో కేవలం 7 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

అయితే, నార్ట్జే IPL 2024 లో దారుణంగా విఫలమయ్యాడు. కానీ, T20 ప్రపంచ కప్ 2024లో తన మొదటి మ్యాచ్‌లో అతను అద్భుత ప్రదర్శనతో లంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. దేశం తరపున మాత్రం తొలి మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు.

ఇరుజట్ల ప్లేయింగ్ 11 ఇదే..

శ్రీలంక: వనిందు హసరంగ (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, కమిందు మెండిస్, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, దసున్ షనక, మహిష్ తీక్షణ, మతిష్ పతిరణ, నువాన్ తుషార.

దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్త్యా, కగిసో రబడ, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సన్, ఒట్నెల్ బార్ట్‌మన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..