మెల్‌బోర్న్ వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా చివరి బంతికి ఉత్కంఠ విజయం సాధించింది. నాలుగు వికెట్లతో విజయం సాధించి ఐసీసీ ఈవెంట్లతో దాయాదిపై తన విజయపరంపరను కొనసాగించింది. కాగా మెల్‌బోర్న్‌లో జరిగిన మ్యాచ్ భారత్, పాక్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్‌కు అసలైన మజాను అందించింది. సుమారు 90,000 మంది ప్రత్యక్షంగా ఈ మ్యాచ్‌ను వీక్షిస్తే.. మ్యాచ్ దెబ్బకు టీవీ ఛానెల్స్ టీఆర్పీ రేటింగ్ అమాంతం పెరిగిపోయింది. ఇక మ్యాచ్ సాగుతున్న కొద్దీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోవీక్షకుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈనేపథ్యంలో ప్రపంచకప్‌లో దాయాది జట్లు మళ్లీ పోటీ పడితే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి అందుకు ఛాన్స్ ఉందా? అంటే అవుననే చెప్పవచ్చు. అన్నీ కుదిరితే రెండు జట్లు మళ్లీ ఫైనల్‌లో మాత్రమే తలపడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం సూపర్-12 మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. గ్రూప్-బిలో ఉన్న భారత్, పాక్.. ఇదే గ్రూప్‌లో ఉన్న దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే, నెదర్లాండ్స్ జట్లను ఓడించాల్సి ఉంటుంది. మొదటి రెండు స్థానాల్లో నిలిచి నేరుగా సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. ఆపై సెమీస్ నాకౌట్ గ్రూపులో గ్రూప్-ఎ నుంచి వచ్చిన టాప్-2 జట్లతో పోటీ పడతాయి. అయితే ఆ గ్రూప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ లాంటి బలమైన టీమ్‌లు ఉన్నాయి. వీటిల్లో నుంచి సెమీస్‌కు వచ్చిన రెండు జట్లను భారత్, పాక్ ఓడిస్తేనే.. దాయాదుల పోరును మళ్లీ వీక్షించే అవకాశం ఉంది.
అంటే.. భారత్, పాక్ జట్లు గ్రూప్ మ్యాచ్‌ల్లో టేబుల్ పట్టికలో టాప్‌లో ఉండాలి. ఆపై సెమీఫైనల్లోనూ ప్రత్యర్థులను ఓడిస్తే ఈ రెండు జట్లు ఫైనల్లో పోటీ పడే అవకాశాలున్నాయి. కాగా భారత్ తన తర్వాతి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఢీకొట్టనుంది. సిడ్నీ వేదికగా గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. ఇక అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు జింబాబ్వేతో తలపడనుంది పాక్ జట్టు. పెర్త్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇక పాక్‌పై విజయంతో టీమిండియా సెమీస్ చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. గ్రూపులో దక్షిణాఫ్రికా జట్టును మినహాయిస్తే.. బంగ్లాదేశ్, జింబాబ్వే, నెదర్లాండ్స్ జట్లు బలహీనంగానే ఉన్నాయి. కాబట్టి నాకౌట్ స్టేజ్‌కు చేరుకోవడం భారత్‌కు పెద్ద ఇబ్బందేమీ కాదు.
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..