Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: సూర్య పట్టిన క్యాచ్‌‌పై డౌట్.. బౌండరీ లైన్ మార్చారంటూ సౌతాఫ్రికా ఫ్యాన్స్ రచ్చ.. అసలు మ్యాటర్ ఇదే..

Suryakumar Yadav Catch Controversy: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ చివరి ఓవర్లో డేవిడ్ మిల్లర్ ఇచ్చిన సంచలన క్యాచ్ పట్టడంతో టీమ్ ఇండియా విజయం ఖాయమైంది. లాంగ్‌ ఆఫ్‌, లాంగ్‌ ఆన్‌ మధ్య లాంగ్‌ రన్‌ అవుతూ తెలివిగా క్యాచ్‌ పట్టాడు. అప్పుడు దక్షిణాఫ్రికా విజయానికి ఆరు బంతుల్లో 16 పరుగులు చేయాల్సి ఉంది. అయితే మిల్లర్ ఔట్‌తో భారత్ పైచేయి సాధించింది. కాగా, సూర్య క్యాచ్ పట్టగానే బౌండరీ రోప్‌లు వెనక్కి వెళ్లాయని, మిల్లర్‌కు ఆరు పరుగులు రావాల్సి ఉందని దక్షిణాఫ్రికా అభిమానులు సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు.

Video: సూర్య పట్టిన క్యాచ్‌‌పై డౌట్.. బౌండరీ లైన్ మార్చారంటూ సౌతాఫ్రికా ఫ్యాన్స్ రచ్చ.. అసలు మ్యాటర్ ఇదే..
Surya Kumar Yadav Video
Follow us
Venkata Chari

|

Updated on: Jun 30, 2024 | 1:04 PM

Suryakumar Yadav Catch Controversy: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ చివరి ఓవర్లో డేవిడ్ మిల్లర్ ఇచ్చిన సంచలన క్యాచ్ పట్టడంతో టీమ్ ఇండియా విజయం ఖాయమైంది. లాంగ్‌ ఆఫ్‌, లాంగ్‌ ఆన్‌ మధ్య లాంగ్‌ రన్‌ అవుతూ తెలివిగా క్యాచ్‌ పట్టాడు. అప్పుడు దక్షిణాఫ్రికా విజయానికి ఆరు బంతుల్లో 16 పరుగులు చేయాల్సి ఉంది. అయితే మిల్లర్ ఔట్‌తో భారత్ పైచేయి సాధించింది. కాగా, సూర్య క్యాచ్ పట్టగానే బౌండరీ రోప్‌లు వెనక్కి వెళ్లాయని, మిల్లర్‌కు ఆరు పరుగులు రావాల్సి ఉందని దక్షిణాఫ్రికా అభిమానులు సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై ఐసీసీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు.

సౌత్ ఆఫ్రికా అభిమానులు సూర్య క్యాచింగ్ ఇన్సిడెంట్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ, బీసీసీఐతోపాటు ఐసీసీని ఏకిపారేస్తున్నారు. సరిహద్దు తాళ్లకు ముందు తెల్లటి సి లైన్ గుర్తు ఉండటం కనిపిస్తుంది. ఇది గడ్డిపై తాడులు ఉన్నప్పుడు వాటిపై మిగిలిపోయిన గుర్తులను పోలి ఉంది. అయితే, తాడును వెనుకకు జరిపారని, తెల్ల రేఖ ఎక్కడైతే కనిపిస్తుందో.. అసలు సరిహద్దు రేఖ అదేనంటూ వాదిస్తున్నారు. రోప్స్ అక్కడ ఉండి ఉంటే, మిల్లర్ కొట్టిన షాట్ దక్షిణాఫ్రికాకు ఆరు పరుగులు వచ్చి ఉండేవని కామెంట్లు చేస్తున్నారు.

ఆ తర్వాత సోషల్ మీడియాలో ఈ అంశంపై చర్చ మొదలైంది. సూర్య క్యాచ్ సరైనదేనని, ఈ క్యాచ్ సమయంలో చూసినట్లుగా మ్యాచ్ మొత్తం బౌండరీ రోప్‌లు ఒకే చోట ఉన్నాయని చాలామంది చెబుతున్నారు. అసలు వీడియోలో ఇవి కనిపించడం లేదని వాదిస్తున్నారు. అసలు బౌండరీ రోప్‌ల కదలికపై క్రికెట్ నియమాలు ఏమి చెబుతున్నాయో కూడా వాళ్లు చెబుతున్నారు.

సరిహద్దు తాళ్ల నియమాలు ఏలా ఉన్నాయంటే?

క్రికెట్ చట్టం 19.3 బౌండరీ రోప్‌ నియమాలను వివరిస్తుంది. దీని కింద, ఒక వస్తువు ద్వారా సరిహద్దు నిర్ణయిస్తే, అది కదులుతున్నట్లయితే, దాని అసలు స్థానం సరిహద్దుగా పరిగణించబడుతుంది. వీలైనంత త్వరగా ఆ వస్తువు దాని అసలు స్థానానికి తీసుకురాశాల్సి ఉంటుంది. సరిహద్దును నిర్ణయించే ఏదైనా వస్తువు మైదానంలోకి వస్తే, అది వెంటనే తీసివేయాలి. గేమ్ ప్రోగ్రెస్‌లో ఉంటే, బాల్ డెడ్ అవుతుంది. ఆ తర్వాతే ఆట మొదలవుతుంది.

సరిహద్దుల్లో ఫీల్డింగ్ వల్ల తాళ్లు కదిలినప్పటికీ, వాటి అసలు స్థలం ఎప్పటిలాగే ఉంటుందని ఈ నియమం నుంచి స్పష్టమవుతుంది. అయితే, ముఖ్యమైన విషయం ఏమిటంటే, సరిహద్దు తాడు వెనక్కి వెళ్లాయా లేదా వీడియోలో కనిపించే ప్రదేశం దాని అసలు ప్రదేశమా లేదా అనేది స్పష్టంగా తెలియదు. అయితే, క్యాచ్ పట్టిన బౌండరీ రోప్‌లలో ఎలాంటి ఆటంకం కలగలేదని మ్యాచ్‌ చూస్తున్నప్పుడు కనిపిస్తోంది. దీంతో సూర్య క్యాచ్ ఖాయమైందేనని తెలుస్తోంది. సౌతాఫ్రికా ఫ్యాన్స్ అర్థం పర్థం లేని కామెంట్లతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..