విరాట్ కోహ్లి టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ అయిన తర్వాత, భారత క్రికెట్ జట్టు నంబర్ 3 స్థానం కోసం అనేక ప్రయోగాలు చేసింది. కానీ తగిన ప్రత్యామ్నాయం ఎవరు కనిపించలేదు. కాని సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో తిలక్ వర్మ తన అద్భుత బ్యాటింగ్‌తో ఈ స్థానాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో తిలక్ వర్మ రెండు వరుస సెంచరీలు చేయడం ద్వారా భారత క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. నాలుగవ టీ20లో 47 బంతుల్లో 120 పరుగులు చేశాడు, మూడో టీ20లోనూ ప్రభావవంతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని దూకుడు బ్యాటింగ్ తో భారత జట్టుకు 3-1 తో సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించింది.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తన స్థానాన్ని త్యాగం చేసి తిలక్ వర్మకు అవకాశం ఇచ్చాడు. సూర్య తన నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తూ, తిలక్ ఫర్ఫామెన్స్ ను ప్రశంసిస్తూ జట్టు విజయానికి తన స్థానాన్ని తిలకు వర్మకు ఇచ్చాడు. “తిలక్ వర్మ జట్టు కోసం అద్భుతంగా ఆడాడని తన భవిష్యత్తు ఏంటో చాటి చెప్పాడని కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అన్నాడు. అతను ఎటువంటి పరిస్థితిలోనైనా బ్యాటింగ్ చేయగలడు. ఇది భారత క్రికెట్ బలాన్ని సూచిస్తుంది.”
ఇక తిలక్ వర్మ విరాట్ కోహ్లీ స్థానంలో బ్యాటింగ్ కు రావడమే కాదు అతడి రికార్డును కూడా బద్దలు కొట్టాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో 280 పరుగులు చేసి, సిరీస్‌లో 198కి పైగా స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు. ఈ సిరీస్‌లో రెండు శతకాలు కూడా సాధించిన తిలక్, టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల సిరీస్‌లో విరాట్ కోహ్లీ 231 పరుగులు సాధించి అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు. అయితే, దక్షిణాఫ్రికా సిరీస్‌లో తిలక్ వర్మ 280 పరుగులతో ఈ రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించాడు.
తిలక్ వర్మతో పాటు సంజూ శాంసన్ కూడా ఓపెనింగ్ బ్యాటర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేశాడు. ఈ సిరీస్‌లో భారత జట్టు యశస్వి జైస్వాల్, శుభ్‌మాన్ గిల్ వంటి యువ ఆటగాళ్లను లేకుండా సత్తా చాటింది. ఈ సిరీస్ ద్వారా, భారత జట్టు కొత్త స్టార్ ప్లేయర్లను కనుగొనడంలో విజయవంతమైంది.
టీ20 ఫార్మాట్‌లో యువ ఆటగాళ్లు యశస్వి, శుభ్‌మాన్, తిలక్, రింకు సింగ్ వంటి ఆటగాళ్లు భారత క్రికెట్ పునాది ఎంత బలంగా ఉందో సూచిస్తున్నారు. విరాట్ కోహ్లి వారసుడిగా నంబర్ 3 స్థానం భవిష్యత్తులో తిలక్ వర్మ కోసం ప్రత్యేక స్థానం అవుతుందని చెప్పవచ్చు. భారత క్రికెట్ వర్గాలు ఇప్పటికే ఈ మార్పును అంగీకరించడంతో పాటు సూర్యకుమార్ యాదవ్ వంటి దీనికి మద్దతు తెలపడం విశేషం.
తిలక్ వర్మ, సంజూ శాంసన్ ప్రదర్శనతో భారత జట్టు టీ20లొ ఎంత ప్రమాదకమరమో తెలిసేలా చేసింది. సిరీస్ విజయంతో, టీ20 ఫార్మాట్‌లో భారత కొన్ని సంవత్సరాల పాటు రూల్ చేయడం ఖాయమని చెప్పవచ్చు.