AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరంతా కాదు అయ్యగారే తోపు.! ఈ ఊచకోత ఇన్నింగ్స్ టచ్ చేసేవాడే లేడు.. కొడితే లైఫ్‌టైం సెటిల్‌మెంట్ రా

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విద్వంసకర ఇన్నింగ్స్‌లలో ఒకటైన సురేష్ రైనా 87(25 బంతుల్లో) పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్ గురించి ఆసక్తికర విశేషాలు ఇక్కడ తెలుసుకోండి. ఐపీఎల్ చరిత్రలోనే ఇదొక విధ్వంసకర ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. ఆ వివరాల కోసం ఈ స్టోరీ చూసేయండి మరి. 

మీరంతా కాదు అయ్యగారే తోపు.! ఈ ఊచకోత ఇన్నింగ్స్ టచ్ చేసేవాడే లేడు.. కొడితే లైఫ్‌టైం సెటిల్‌మెంట్ రా
Ipl 2026
Ravi Kiran
|

Updated on: Apr 28, 2026 | 8:08 AM

Share

ఐపీఎల్ చరిత్రలో మే 30వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. సరిగ్గా ఇదే రోజు 2014లో, ముంబైలోని వాంఖడే స్టేడియం ఒక చారిత్రాత్మక ఇన్నింగ్స్‌కు సాక్ష్యంగా నిలిచింది. క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్(KXIP) నిర్దేశించిన 227 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్(CSK) బ్యాటర్ సురేష్ రైనా ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. పంజాబ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 58 బంతుల్లో 122 పరుగులు చేసి తన వింటేజ్ ప్రదర్శనతో పంజాబ్‌కు భారీ స్కోరు అందించారు.

ఇది చదవండి: కరివేపాకు మొక్క పెరగడం లేదా.? ఇవి ఇచ్చారంటే పచ్చగా, వద్దన్నా గుబురుగా పెరుగుతుంది..

అయితే, ఆ లక్ష్యాన్ని రైనా ఒంటిచేత్తో కరిగించేలా కనిపించారు. కేవలం 25 బంతుల్లోనే 87 పరుగులు చేసి స్టేడియాన్ని హోరెత్తించారు. ఇందులో 12 ఫోర్లు, 6 మెరుపు సిక్సర్లు ఉండటం గమనార్హం. రైనా తన అర్ధ సెంచరీని కేవలం 16 బంతుల్లోనే పూర్తి చేసి, ఆ సమయంలో ఐపీఎల్‌లో రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీగా రికార్డు సృష్టించారు. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 100/2 కాగా, అందులో రైనా ఒక్కరే 87 పరుగులు చేయడం విశేషం. కానీ, దురదృష్టవశాత్తూ పవర్ ప్లే ముగిసిన వెంటనే మొదటి బంతికే రైనా రన్ అవుట్ అయ్యారు.

బ్రెండన్ మెకల్లమ్ పిలుపు మేరకు పరుగు తీయబోగా, జార్జ్ బెయిలీ డైరెక్ట్ హిట్‌తో రైనాను పెవిలియన్ చేర్చారు. ఒకవేళ రైనా మరో ఐదు ఓవర్లు క్రీజులో ఉండి ఉంటే, ఫలితం మరోలా ఉండేదని అభిమానులు ఇప్పటికీ చర్చించుకుంటారు. చివరికి చెన్నై 202 పరుగులకు పరిమితమై ఓడిపోయింది. “నా మనసులో అప్పుడు ఒక్కటే ఉంది.. ఎలాగైనా ఫైనల్స్‌కు చేరాలి, అస్సలు వదలకూడదు అనుకున్నాను” అని రైనా ఆ ఇన్నింగ్స్‌ను గుర్తుచేసుకున్నారు. ఇప్పటికీ ఎంతమంది ప్లేయర్స్ ఎన్ని విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడినా.. సురేష్ రైనా రికార్డును మాత్రం ఎవ్వరూ బద్దలు కొట్టలేరు.

ఇది చదవండి: అప్పు ఇస్తున్నారా.? ప్రామిసరీ నోటు మీద ఇది లేకపోతే.. చిత్తు కాగితంతో సమానం..

Follow Us
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?