SRH: కాటేరమ్మ కొడుకులకు దిష్టి తగిలిందా? ఆ ఒక్కటి మార్చుకుంటే సరిపోతుంది..!
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే, అస్థిరత కూడా కనిపిస్తోంది. అత్యధిక స్కోర్లు చేసినా, తక్కువ స్కోర్లకు కుప్పకూలిపోతోంది. ఓవర్ ఆగ్రెసివ్‌నెస్ తగ్గించుకొని, బౌలింగ్‌లో మెరుగైన ప్రణాళికతో ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్ చరిత్రలోనే మరే టీమ్ చేయనంత విధ్వంసకర బ్యాటింగ్ చేస్తూ.. ప్రత్యర్థులను వణికించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లు కొట్టిన టీమ్‌గా ఆరెంజ్ ఆర్మీకి తిరుగులేని రికార్డ్ ఉంది. 287, 286, 277 ఇలా పెద్ద పెద్ద స్కోర్లన్ని ఎస్‌ఆర్‌హెచ్ పేరిటే ఉన్నాయి. గత సీజన్ నుంచే ఇలాంటి దూకుడైన ఆటను చూపిస్తున్న ఎస్‌ఆర్‌హెచ్.. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే 286 పరుగుల భారీ స్కోర్ కొట్టింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇదే రెండో అత్యధిక స్కోర్. నంబర్ వన్ కూడా సన్‌రైజర్స్ పేరిటే ఉంది. ఇంత భీకర బ్యాటింగ్ చేసే జట్టు.. బ్యాటింగ్ పిచ్‌పై కేవలం 120కే కుప్పకూలడంతో అంత షాక్ అయ్యారు.
తొలి మ్యాచ్ తర్వాత.. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయి.. అప్పుడో ప్లే ఆఫ్ అకాశాలు సంక్లిష్టం చేసుకుంది. సీజన్ ఆరంభానికి ముందు, సీజన్ ఆరంభమై తొలి మ్యాచ్ ముగిసిన తర్వాత.. వామ్మో.. కాటేరమ్మ కొడుకుల టీమ్ అంటూ అభిమానుల జేజేలు అందుకున్న ఎస్‌ఆర్‌హెచ్ ఇప్పుడు.. ఈ టీమ్ ఏంటి ఇలా ఆడుతోంది అంటూ విమర్శలు ఎదుర్కొంటోంది. ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ సైతం.. టీమ్ ప్రదర్శనపై అసంతృప్తిగా ఉన్నారు. ఎంత అగ్రెసివ్ గేమ్ ఆడినా.. మరీ ఇంత అడ్డిగుడ్డిగా బ్యాటింగ్ చేస్తారా అంటూ మండిపడుతున్నారు. తొలి మ్యాచ్‌లోనే సూపర్ బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌కు మిగతా టీమ్ అభిమానుల దిష్టి తగిలిందేమో అంటూ కొంతమంది నెటిజన్లు సరదాగా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
అయితే.. మరీ ఓవర్ అగ్రెసివ్‌గా కాకుండా.. పిచ్ కండీషన్, మ్యాచ్ సిచ్యూవేషన్‌ను బట్టి కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా కూడా ఆడాల్సిన అవసరం ఉందని, ప్రతి మ్యాచ్‌లో 250కి పైగా స్కోర్ కొట్టాలంటే కష్టమని, ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే రాబోయే మ్యాచ్‌ల్లో కాస్త చూసి ఆడుకుంటే సరిపోతుందని క్రికెట్ నిపుణులు అంటున్నారు. కాస్త ఓవర్ అగ్రెసివ్‌నెస్ తగ్గించుకొని, బౌలింగ్‌లో సరైన మార్పులు చేసుకుంటే.. ఎస్‌ఆర్‌హెచ్ మళ్లీ విజయాల బాటపట్టే అవకాశం ఉంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




