
Sunrisers Hyderabad Players on Maldives Vacation: ఐపీఎల్ 2025 సీజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రత్యేకంగా ఏమీ లేదు. పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే దశలో ఉంది. ఇంతలో, ఫ్రాంచైజ్ యజమాని కావ్య మారన్ కీలక అడుగు వేసింది. సీజన్ మధ్యలో మొత్తం జట్టును సెలవుల కోసం విదేశాలకు పంపింది. ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో హైదరాబాద్ కేవలం మూడింటిలో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది.
గత చివరి మ్యాచ్‌లో హైదరాబాద్ ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించిన తర్వాత, సహాయక సిబ్బందితో సహా మొత్తం జట్టును మాల్దీవులకు సెలవులపై పంపింది. హైదరాబాద్ ఆటగాళ్ళు, సహాయక సిబ్బంది వచ్చే వారం భారతదేశానికి తిరిగి రావొచ్చు. హైదరాబాద్ తదుపరి మ్యాచ్ మే 2న అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతుంది. ఆ మ్యాచ్‌కు రెండు మూడు రోజుల ముందు వారు మాల్దీవుల నుంచి నేరుగా అహ్మదాబాద్ చేరుకోనుంది.
Team SRH in Maldives for a mini vacation. pic.twitter.com/UJeOdf7rus
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 27, 2025
హైదరాబాద్ జట్టును మాల్దీవులకు పంపడం వెనుక ఒక ప్రత్యేక కారణం కావ్య తండ్రి నిర్ణయమంట. జట్టుకు కొంత ఉపశమనం లభించేలా అతను ఈ యాత్రను ప్లాన్ చేశాడంట. ఈ పర్యటన ఆటగాళ్లకు విశ్రాంతినిస్తుందని, వారి మనోధైర్యాన్ని పెంచుతుందని అతను నమ్మాడని. తదుపరి మ్యాచ్‌లలో దూకుడుగా ఆడతారని భావిస్తున్నాడంట. అయితే, మాల్దీవుల పర్యటన తర్వాత తదుపరి 5 మ్యాచ్‌లను గెలవాలని షరతు పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి.
శుక్రవారం చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఐదు వికెట్ల తేడాతో ఆతిథ్య చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి తన పరాజయాల పరంపరకు ముగింపు పలికింది. చెన్నైని 154 పరుగులకే ఆలౌట్ చేసిన హైదరాబాద్, 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ రీచ్ అయింది. ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ చేపాక్ పిచ్‌ను అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. హర్షల్ 28 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు. దీని కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కూడా విఫలమైంది. దీంతో చెన్నై జట్టు 19.5 ఓవర్లలో కేవలం 154 పరుగులకు ఆలౌట్ అయింది. మంచుతో కూడిన పిచ్ నుంచి సహాయం లభించినప్పటికీ, హైదరాబాద్ 19వ ఓవర్లో లక్ష్యాన్ని సాధించింది.
ఫామ్‌లో లేని ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 44) టాప్ ఆర్డర్‌లో బాధ్యతాయుతంగా ఆడారు. ఆ తర్వాత కామిందు మెండిస్ (22 బంతుల్లో 32 నాటౌట్), నితీష్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 19 నాటౌట్) 49 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకుని జట్టుకు రెండు పాయింట్లు అందించారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..