AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియా, శ్రీలంక సిరీస్‌కు ముందు షాకింగ్ న్యూస్..! వెటరన్ ప్లేయర్స్ రిటైర్మెంట్ చేస్తామని బెదిరింపులు..?

Srilanka Cricketers : ఈ ఏడాది జూలైలో భారత్, శ్రీలంక మధ్య వరుస వన్డేలు, టీ 20 మ్యాచ్‌లు ఉన్నాయి. పెరుగుతున్న కరోనా వైరస్ కేసులతో

ఇండియా, శ్రీలంక సిరీస్‌కు ముందు షాకింగ్ న్యూస్..! వెటరన్ ప్లేయర్స్ రిటైర్మెంట్ చేస్తామని బెదిరింపులు..?
India Sri Lanka
uppula Raju
|

Updated on: May 17, 2021 | 10:32 PM

Share

Srilanka Cricketers : ఈ ఏడాది జూలైలో భారత్, శ్రీలంక మధ్య వరుస వన్డేలు, టీ 20 మ్యాచ్‌లు ఉన్నాయి. పెరుగుతున్న కరోనా వైరస్ కేసులతో ఈ సిరీస్ జరుగుతుందా లేదా అనే ప్రశ్న అందరిలో ఉంది. అయితే ఇదే సమయంలో క్రికెటర్లకు, బోర్డుకు మధ్య గొడవలు జరగుతున్నాయి. వాస్తవానికి శ్రీలంక క్రికెట్ జట్టు ఆటగాళ్ళు ముందస్తుగా అందరం రిటైర్మెంట్ ప్రకటిస్తామని తమ దేశ బోర్డును బెదిరించారు. కారణం బోర్డు కొత్త స్కోరు ఆధారిత గ్రేడింగ్ విధానం. దీని ద్వారా క్రికెటర్ల వార్షిక ఆదాయాన్ని అంచనా వేయాలని నిర్ణయించింది.

గ్రేడ్ ప్రాతిపదికన వారికి ఎలా మార్కులు ఇస్తారో చెప్పాలని శ్రీలంక క్రికెటర్లు కోరుతున్నారు. ఎందుకంటే ఇది వారి ఆదాయాలపై ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాన్ని చూపుతుంది. కొత్త వ్యవస్థలో ఆటగాళ్లను నాలుగు వేర్వేరు గ్రూపులుగా విభజించారు. ఇందులో వారి ఫిట్‌నెస్ స్థాయి, క్రమశిక్షణ, నాయకత్వ సామర్థ్యం,​జట్టు పట్ల వారి సహకారం, గత రెండేళ్లలో అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌లో వారి ఆటతీరు ఆధారంగా మార్కులు ఇవ్వబడతాయి. ఇది కొంతమంది ఆటగాళ్లకు నష్టం కలిగించేలా ఉంది. అయితే పదవీ విరమణ చేస్తామని బెదిరించిన ఆటగాళ్ల పేర్లు ఇంకా వెల్లడించలేదు.

ఇటువంటి సందర్భంలో ఆటగాళ్లందరూ ఐక్యంగా ఉంటారు. అదే సమయంలో శ్రీలంక క్రికెట్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యుడు ఆష్లే డిసిల్వా, క్రీడాకారుల డిమాండ్ ప్రకారం ఒప్పందాన్ని సవరించారని చెప్పారు. ఒప్పందాన్ని ఖరారు చేసిన తరువాత సీనియర్ ఆటగాళ్లతో మాట్లాడతామన్నారు. ఈ ఒప్పందంపై తాను సంతకం చేయనని ఇప్పటివరకు ఏ ఆటగాడు చెప్పలేదని స్పష్టం చేశారు.

నాకు అంత టాలెంట్ లేదు.. ఐటం గర్ల్ అన్న గుర్తింపు పట్ల ఎలాంటి రిగ్రెట్స్ లేవు.. బిగ్‏బాస్ బ్యూటీ..

Mother kills Children: భర్త తిట్టాడని భార్య ఘాతుకం.. ఇద్దరు కన్నబిడ్డల గొంతు కోసి తానూ ఆత్మహత్య.. పిల్లలిద్దరు మృతి

కేరళలో కెనరా బ్యాంకును మోసగించి రూ. 8 కోట్లు కాజేసిన క్లర్క్ అరెస్ట్….పోలీసులు వలపన్ని బెంగుళూరులో పట్టేశారు