
Suzie Bates Record Sri Lanka W vs New Zealand W: న్యూజిలాండ్ క్రికెటర్ సుజీ బేట్స్ ఆసక్తికరమైన రికార్డును కలిగి ఉంది. 10 దేశాల్లో టీ20 హాఫ్ సెంచరీలు సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. ఇటీవల కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బేట్స్ హాఫ్ సెంచరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టీం 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 119 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూజిలాండ్ కేవలం 18.4 ఓవర్లలోనే ఛేదించింది.
మహిళల క్రికెట్‌లో శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్ కొలంబో వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో సుజీ బేట్స్ అద్భుత హాఫ్ సెంచరీతో ఆకట్టుకుంది. 53 బంతుల్లో 52 పరుగులు చేసింది. సుజీ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు ఉన్నాయి. ఈ హాఫ్ సెంచరీ సాయంతో ఆమె స్పెషల్ రికార్డు సృష్టించింది. 10 దేశాల్లో టీ20 హాఫ్ సెంచరీలు సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. బేట్స్ శ్రీలంకతో పాటు భారత్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఐర్లాండ్‌లలో హాఫ్ సెంచరీలు సాధించింది.
ఇప్పటి వరకు ఆడిన 151 వన్డేల్లో 5359 పరుగులు చేసింది. బేట్స్ 12 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు చేసింది. ఆమె అత్యుత్తమ స్కోరు 168 పరుగులు. 145 టీ20 మ్యాచ్‌లు ఆడి 3916 పరుగులు చేసింది. ఈ ఫార్మాట్‌లో ఆమె ఒక సెంచరీ, 26 హాఫ్ సెంచరీలు చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..