Video: W,W,W,W.. 4 బంతుల్లో 4 వికెట్లు.. థ్రిల్లర్ సినిమాకే మెంటలెక్కించే మ్యాచ్.. వీడియో చూస్తే గూస్ బంప్సే
Unique Double Hat-Trick for Lasith Malinga: క్రికెట్‌లో ప్రతిరోజూ కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. మరికొన్ని బద్దలవుతుంటాయి. ఇక వన్డే క్రికెట్ నిర్వచనాన్నే మార్చిన ఒక మ్యాచ్ గురించి తెలిస్తే.. కచ్చితంగా షాక్ అవుతారు. ఇందులో ఓ బౌలర్ ఏకండా డబుల్ హ్యాట్రిక్‌తో మంటలు పుట్టించాడు.

Unbreakable Cricket Record: క్రికెట్‌లో ప్రతిరోజూ కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. మరికొన్ని బద్దలవుతుంటాయి. ఇక వన్డే క్రికెట్ నిర్వచనాన్నే మార్చిన ఒక మ్యాచ్ గురించి తెలిస్తే.. కచ్చితంగా షాక్ అవుతారు. దక్షిణాఫ్రికా అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌కు మ్యాచ్‌లో గెలిచేందుకు కేవలం 4 పరుగులు మాత్రమే అవసరం. చివరి 5 ఓవర్లలో శ్రీలంక, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ ఒక థ్రిల్లర్ సినిమా కంటే తక్కువేం కాదనిపిస్తోంది.
డబుల్ హ్యాట్రిక్‌తో కొత్త చరిత్ర..
హ్యాట్రిక్ అంటే 3 బంతుల్లో 3 వికెట్లు అని తెలిసిందే. కానీ, క్రికెట్ నిర్వచనంలో డబుల్ హ్యాట్రిక్ అంటే 4 బంతుల్లో 4 వికెట్లు. 2007 ప్రపంచ కప్‌లో డబుల్ హ్యాట్రిక్‌తో కొత్త చరిత్ర నమోదైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో డేంజరస్ బౌలర్‌గా పేరుగాంచిన లసిత్ మలింగ, ఆ సమయంలో డబుల్ హ్యాట్రిక్ తీసిన మొదటి బౌలర్‌గా నిరూపించుకున్నాడు. ఆ కాలంలో ఇది ఒక అద్భుతం కంటే తక్కువేంకాదు కాదు. విజయానికి దగ్గరలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు కేవలం 4 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది.
మలింగ 4 బంతుల్లో 4 వికెట్లు..
2007 ప్రపంచ కప్ సూపర్-8 మ్యాచ్‌లో శ్రీలంక దక్షిణాఫ్రికాను ఎదుర్కొంది. దక్షిణాఫ్రికా జట్టు విజయానికి చేరువలో ఉంది. జట్టుకు ఇంకా 32 బంతులు ఉన్నాయి. గెలవడానికి కేవలం 4 పరుగులు మాత్రమే అవసరం. కానీ, ఆ తర్వాత శ్రీలంక పేసర్ లసిత్ మలింగ నుంచి వికెట్ల తుఫాను వచ్చింది. ఆఫ్రికా జట్టు ఖాతాలో 5 వికెట్లు మిగిలి ఉన్నాయి. 45వ ఓవర్ 5వ, 6వ బంతికి మలింగ వరుసగా ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపాడు. షాన్ పొల్లాక్, ఆండ్రూ హాల్‌లను తన బాధితులుగా చేసుకున్నాడు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
https://t.co/0kpuqfnRNR Unbreakable Cricket Record
— venkata chari thoudoju (@ThoudojuChari) May 3, 2025
దక్షిణాఫ్రికా భారీ విజయం..
వరుసగా రెండు వికెట్లు తీసిన తర్వాత, చమిందా వాస్ వేసిన 46వ ఓవర్లో ఒక్క పరుగు రాలేదు. కెప్టెన్ మళ్ళీ 47వ ఓవర్‌ను మలింగకు అప్పగించాడు. మొదటి బంతికే 86 పరుగులతో ఆడుతున్న జాక్వెస్ కల్లిస్ వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత, మలింగ తదుపరి బంతికి నంబర్ 10 బ్యాట్స్‌మన్ మఖాయ ఎన్తినిని పెవిలియన్ చేర్చి క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించాడు. ఇక శ్రీలంక విజయానికి ఒక వికెట్ దూరంలో ఉండగా ఆఫ్రికా ఊపిరి పీల్చుకుంది. అయితే, చివరికి ఆఫ్రికా ఒక వికెట్ తేడాతో మ్యాచ్ గెలిచింది. కానీ, ఈ విజయం కంటే, మలింగ రికార్డు గురించి చర్చ జరిగింది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








