బెంగళూరుపై సన్‌రైజర్స్‌ ఘన విజయం

బెంగళూరుపై సన్‌రైజర్స్‌ ఘన విజయం

హైదరాబాద్‌: ఉప్పల్‌ వేదికగా జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 118 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. బెంగళూరుపై గెలిచి ఈ సీజన్‌లో వరుసగా రెండో విజయం అందుకుంది.  తొలుత బ్యాటింగ్‌లో కుమ్మేసిన సన్‌రైజర్స్‌..ఆ తర్వాత బౌలింగ్‌లోను అదరగొట్టింది. సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 232 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ ఘోరంగా విఫలమైంది. మొదట టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న రాయల్‌ ఛాలెంజర్స్‌కు హైదరాబాద్‌ ఓపెనర్లు చుక్కలు చూపించారు. డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌స్టో ఇద్దరూ శతకాలతో […]

Ram Naramaneni

|

Mar 31, 2019 | 8:14 PM

హైదరాబాద్‌: ఉప్పల్‌ వేదికగా జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 118 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. బెంగళూరుపై గెలిచి ఈ సీజన్‌లో వరుసగా రెండో విజయం అందుకుంది.  తొలుత బ్యాటింగ్‌లో కుమ్మేసిన సన్‌రైజర్స్‌..ఆ తర్వాత బౌలింగ్‌లోను అదరగొట్టింది. సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 232 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ ఘోరంగా విఫలమైంది. మొదట టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న రాయల్‌ ఛాలెంజర్స్‌కు హైదరాబాద్‌ ఓపెనర్లు చుక్కలు చూపించారు. డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌స్టో ఇద్దరూ శతకాలతో చెలరేగడంతో హైదరాబాద్‌ 231 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. బెయిర్‌స్టో 56 బంతుల్లో 114  పరుగులు (12×4, 7×6) చేసి చాహల్‌ బౌలింగ్‌లో ఉమేశ్‌యాదవ్‌ చేతికి చిక్కాడు. అనంతరం విజయ్‌శంకర్‌ 9 పరుగులకే రనౌట్‌గా వెనుతిరిగాడు. చివరి ఓవర్‌లో ఫోర్‌ కొట్టి వార్నర్‌ ఐపీఎల్‌లో రెండో శతకం సాధించాడు. దీంతో సన్‌రైజర్స్‌ జట్టు బెంగళూరు ముందు భారీ లక్ష్యం నిర్దేశించింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ ఛాలెంజర్స్‌ ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. ఆర్సీబీ ఆటగాళ్లలో పార్థివ్‌ పటేల్‌(11), హెట్‌మెయిర్‌(9), విరాట్‌ కోహ్లి(3), ఏబీ డివిలియర్స్‌(1), మొయిన్‌ అలీ(2), శివం దూబే(5)లు తీవ్రంగా నిరాశపరిచారు. వచ్చిన వారు వచ్చినట్లు పెవిలియన్‌కు చేరడంతో ఆర్సీబీ 35 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలో గ్రాండ్‌ హోమ్‌(37), ప్రయాస్‌ రే బర్మన్‌(19)లు ఇన్నింగ్స్‌‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 51 పరుగులు జత చేయడంతో ఆర్సీబీ కాస్త కుదుటపడింది. ప‍్రయాస్‌ రే ఔట్‌ అయిన తర్వాత ఉమేశ్‌ యాదవ్‌(14), చహల్‌(1)లు స్వల్ప వ్యవధిలో ఔట్‌ కావడంతో ఆర్సీబీ 19.5 ఓవర్లలో ఆలౌటైంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu