ఉత్కంఠ పోరులో రాజస్థాన్‍పై చెన్నై విజయం

డిఫెండింగ్‌ చాంప్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ధోనీ (46 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 75 నాటౌట్‌) తనదైన మార్క్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో.. ఆదివారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 8 పరుగులతో రాజస్థాన్‌ రాయల్స్‌పై గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 175/5 స్కోరు చేసింది. సురేష్‌ రైనా (32 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 36), బ్రావో (27) […]

ఉత్కంఠ పోరులో రాజస్థాన్‍పై చెన్నై విజయం
Follow us

| Edited By:

Updated on: Apr 01, 2019 | 9:56 AM

డిఫెండింగ్‌ చాంప్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ధోనీ (46 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 75 నాటౌట్‌) తనదైన మార్క్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో.. ఆదివారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 8 పరుగులతో రాజస్థాన్‌ రాయల్స్‌పై గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 175/5 స్కోరు చేసింది. సురేష్‌ రైనా (32 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 36), బ్రావో (27) సహకారం అందించారు. జోఫ్రా ఆర్చర్‌ (2/17) రెండు వికెట్లు పడగొట్టాడు. 176 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఖరి బంతికి వరకు పోరాడిన రాజస్థాన్‌.. 167/8 స్కోరు మాత్రమే చేసింది. బెన్‌ స్టోక్స్‌ (26 బంతుల్లో ఫోర్‌, 3 సిక్సర్లతో 46) ఒంటరి పోరాటం చేశాడు.